Tirumala: టీటీడీ ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటా విడుదల

Special Darshan Tickets Of Tirumala February Quota: చిత్తూరు జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను విడుదల చేశారు. ఫిబ్రవరి నెలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను బుధవారం ఉదయం 9 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది.

Written by - Shankar Dukanam | Last Updated : Jan 20, 2021, 02:15 PM IST
  • చిత్తూరు జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు
  • ఫిబ్రవరి నెలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా విడుదల చేసిన టీటీడీ
  • జనవరి 20న మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలో గదుల బుకింగ్‌ కోటా
Tirumala: టీటీడీ ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటా విడుదల

Special Darshan Tickets Of Tirumala February Quota: చిత్తూరు జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను విడుదల చేశారు. ఫిబ్రవరి నెలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను బుధవారం ఉదయం 9 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) విడుదల చేసింది. జనవరి 20న మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలో గదుల బుకింగ్‌ కోటాను విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

తిరుమలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ప్రవేశ దర్శనం, గదుల టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతున్నారు. ఈ సౌకర్యాలు వినియోగించుకుంటే తిరుమలను సందర్శించే భక్తులకు ఇబ్బందులు తప్పుతాయని టీటీడీ(TTD)  పేర్కొంది. వచ్చే నెల 19న రథసప్తమి సందర్భంగా దర్శన టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే అనుమతించనున్నారు.

Also Read: PPF: ఈ తేదీలోగా నగదు జమ చేస్తేనే వడ్డీ, ప్రయోజనాలు

రథసప్తమి సందర్భంగా తిరుమల(Tirumala) ఆలయ మాడవీధుల్లో స్వామివారిని ఊరేగిస్తారు. ఉదయం సూర్యప్రభ వాహనంతో మొదలయ్యే స్వామివారి కార్యక్రమం రాత్రి చంద్రప్రభ వాహనంపై ఊరేగింపుతో ముగుస్తుంది. ఉదయం 5:30గంటల నుంచి 8 గంటల వరకు సూర్యప్రభ వాహనంపై ఆలయ మాడవీధుల్లో స్వామివారి వాహనసేన కార్యక్రమం నిర్వహిస్తారు.

Also Read : ​Benifits Of EPF Account: మీకు ఈపీఎఫ్ అకౌంట్ ఉందా.. ఈ బెనిఫిట్స్ తెలుసా! 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News