Amaravati Capital Issue: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో హైకోర్టులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాజధానిని మార్చే అధికారం శాసనసభకు ఎందుకుండదని కోర్టు ప్రశ్నించడం ప్రాధాన్యత సంతరించుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఏపీ రాజధాని (Ap Capital ) వ్యవహారం మరోసారి చర్చకొచ్చింది. అమరావతి స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటీషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్బంగా హైకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. శాసనసభ తీర్మానం ద్వారా అమరావతిని రాజధానిగా నిర్ణయించినప్పుడు..అదే శాసనసభకు రాజధానిని మార్చే అధికారం ఎందుకుండదని హైకోర్టు ( Ap High court ) ప్రశ్నించింది. 


కోర్టులో వాదనలు


పరి పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ ( CRDA Act ) రద్దు చట్టాలను సవాలు చేస్తూ హైకోర్టులో దాఖలైన పిటీషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, జస్టిస్ సత్యనారాయణమూర్తి, జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం విచారణ జరుపుతోంది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం అమరావతిని రాజధానిగా నిర్ణయించారని, ఇప్పుడు రాజధానిని మార్చాలంటే పునర్విభజన చట్టానికి సవరణ చేయాల్సిందేనని పిటీషనర్ వాదించారు. మూడు రాజధానుల ఏర్పాటు వల్ల రైతులకిచ్చిన హామీలను ఉల్లంఘించినట్టవుతుందన్నారు. Also read: AP: పొంచి ఉన్న మరో రెండు తుపాన్లు


పునర్విభజన చట్టం ( Ap Reorganisation Act ) అమల్లో ఉన్నంతకాలం హైకోర్టును మార్చడానికి వీల్లేదAp ని మరో పిటీషనర్ తరపు న్యాయవాది తెలిపారు. హైకోర్టును మార్చేందుకు చట్టం చేసే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు. దాంతో స్పందించిన హైకోర్టు..రాజధానిని నిర్ణయించే విషయంలో కేంద్రం, రాష్ట్రాలకు అధికారముందని పునర్విభజన చట్టం, సీఆర్డీఏ చట్టాల్లో లేదని గుర్తు చేసింది. అటువంటప్పుడు అమరావతిని రాజధానిగా ఎలా నిర్ణయించారని ప్రశ్నించింది కోర్టు. శాసనసభ ( Assembly ) లో తీర్మానం ద్వారా అమరావతిని రాజధాని ( Amaravati capital issue ) గా నిర్ణయించారని పిటీషనర్ న్యాయవాది సమాధానమిచ్చారు. అటువంటప్పుడు రాజధానిని నిర్ణయించే అధికారం శాసనసభకు ఉన్నప్పుడు..మార్చే అధికారం కూడా శాసనసభకు ఉంటుంది కదా అని సందేహం వ్యక్తం చేసిన హైకోర్టు విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది. 


పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాల బిల్లులు ఆమోదం పొందే సమయంలో శాసన మండలిలో చోటు చేసుకున్న పరిణామాలకు సంబంధించి రికార్డులు, వీడియో ఫుటేజీని వెంటనే కోర్టుకు సమర్పించాలని శాసనసభ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. రికార్డుల్ని వెంటనే ఇస్తామని..బ్లూ కాపీ మాత్రం స్పీకర్ అనుమతి తీసుకన్న తరువాతే ఇవ్వగలమని చెప్పారు. 


పిటిషనర్ల తరఫు న్యాయవాదుల్లో కొందరి వాదనలు ముగిసిన తరువాత, మిగిలినవారు తమ వాదనలు వినిపించేందుకు ప్రత్యక్షంగా హాజరు కాలేదు. దాంతో తీవ్ర అసహనం వ్యక్తం చేసిన కోర్టు..ఏ కేసులో సంబంధిత న్యాయవాది రాలేదో..వాటిని విచారణ నుంచి తొలగించింది. Also read: AP: ఇక పోలీసుల అదుపులో డాక్టర్ రమేష్ బాబు