AP High Court: ఏపీ ప్రభుత్వం నియమించిన నూతన మహిళా పోలీసులపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మహిళలకు అధికారమిస్తే తప్పేంటని ప్రశ్నించింది. కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా సంరక్షణ కార్యదర్శుల్ని మహిళా పోలీసులుగా(Women Police) పోలీసు శాఖలో అంతర్భాగంగా పరిగణిస్తూ 2021 జూన్ నెలలో జారీ చేసిన జీవో 59పై హైకోర్టు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోరింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని చెప్పింది. ఇందులో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, ఏపీపీఎస్‌సీ చైర్మన్, పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు చైర్మన్‌ తదితరులకు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను నవంబర్‌ 24కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ ఆకుల వెంకటశేషసాయిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది.


ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 59ని(GO Number 59)తప్పుబడుతూ విశాఖపట్నంకు చెందిన ఓ వ్యక్తి పిటీషన్ దాఖలు చేశాడు. దీనిపై హైకోర్టు(Ap High Court)ధర్మాసనం విచారణ చేపట్టింది. అసలు మహిళలకు అధికారం ఇస్తే తప్పేముందని ప్రశ్నించింది.మహిళలకు అధికారం ఇస్తే ఆందోళన చెందాల్సిన అవసరం లేదంది. ప్రజలకు సేవ చేయడానికే కదా ప్రభుత్వం మహిళలను పోలీసులుగా గుర్తిస్తోందంటూ వ్యాఖ్యానించింది. అయితే మహిళలకు అధికారం ఇవ్వడాన్ని తాము తప్పుపట్టడం లేదని, నిబంధనలకు విరుద్ధంగా చేయడాన్నే తప్పుపడుతున్నామని పిటీషనర్ తరపు న్యాయవాది వాదించారు. పోలీసు నియామక బోర్డు ద్వారానే పోలీసు నియామకాలు జరగాల్సి ఉంటుందన్నారు. మహిళా సంరక్షణ కార్యదర్శులను పోలీసులుగా పరిగణించడంతోపాటు వారికి పోలీసు యూనిఫాం ఇవ్వడంతోపాటు కానిస్టేబుల్‌కు ఉండే అధికారాలు, బాధ్యతలు కట్టబెట్డడం చట్టవిరుద్ధమని చెప్పారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని(Ap government)ఆదేశించి హైకోర్టు(Ap High Court)..విచారణను నవంబర్ 24కు వాయిదా వేసింది. 


Also read: Heavy Rains: రానున్న రెండ్రోజుల్లో ఏపీలో భారీ వర్షాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook