ప్రతిష్ఠాత్మక పోలవరం ప్రాజెక్టుపై ( Polavaram project ) నెలకొన్న సంక్లిష్టతను తొలగించేందుకు ఏపీ ప్రభుత్వం ( Ap Government ) రంగంలో దిగింది. కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో రాష్ట్ర మంత్రి రాజేంద్రనాధ్ రెడ్డి చర్చలు జరిపారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అంశాల్ని కేంద్రమంత్రికి వివరించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఆంధ్రప్రదేశ్ జీవనరేఖ పోలవరం ప్రాజెక్టు ( Ap lifeline polavaram project ) విషయంలో గందరగోళం నెలకొంది. 2014 అంచనాల్నే ఆమోదిస్తామని కేంద్రం ప్రకటించడంతో నెలకొన్న వివాదాన్ని పరిష్కరించేందుకు ఏపీ ప్రభుత్వం రంగంలో దిగింది. ఈ మేరకు ఏపీ ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ( Ap finance minister Buggana Rajendranath reddy )..కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ( Central Finance minister Nirmala Sitaraman ) తో ప్రత్యేకంగా చర్చలు జరిపారు. పోలవరం ప్రాజెక్టు నిధులు, సవరించిన అంచనా వ్యయం, ఆర్ధిక సాయంపై ఇరువురి మధ్య చర్చలు జరిగాయి. 


పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అంశాల్ని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. సవరించిన అంచనాలకు ఆమోదం తెలిపే విషయాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్టు చెప్పారు. పోలవరం అంచనాల్ని కేంద్రం అంగీకరిస్తుందని ఆశిస్తున్నట్టు మంత్రి తెలిపారు.  Also read: AP Schools reopen effect: విద్యార్ధులు, టీచర్లకు సోకిన కరోనా


పోలవరం ప్రాజెక్టు కోసం రాష్ట్రం ఖర్చు చేసిన 4 వేల కోట్లకు..2 వేల 234 కోట్లకు కేంద్ర ప్రభుత్వం ( Central Government ) ఇటీవల అనుమతిచ్చింది.  2013-14 అంచనాలకు టీడీపీ ప్రభుత్వం అంగీకరించిందని..అయితే అప్పటి అంచనా కంటే భూ సేకరణకే 17 వేల కోట్లు అదనంగా అవుతుందని మంత్రి స్పష్టం చేశారు. భూ సేకరణలో మాత్రం 2005-06 నాటి అంచనాలనే..2013-14లో ప్రస్తావించినట్టు వివరించారు. డీపీఆర్ 1, 2 సహా సవరించిన అంచనాల్ని కేంద్రమంత్రికి ఇచ్చామని మంత్రి రాజేంద్రనాథ్ తెలిపారు. నివేదికను పూర్తిగా పరిశీలించి నిధులు మంజూరు చేయాలని కోరినట్టు చెప్పారు.


రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుపై మొత్తం 12 వేల కోట్లు ఖర్చుపెట్టగా..కేంద్రం 8 వేల కోట్లే మంజూరు చేసిందని..ఇంకా 4 వేల కోట్లు రావల్సి ఉందన్నారు. ఈ 4 వేల కోట్లలో తాజాగా 2 వేల 234 కోట్లకు మంజూరు లభించిందన్నారు. ప్రాజెక్టు పునరావాసంలో అంచనాలు పెరిగే అవకాశాలున్నాయని కేంద్రమే నాడు తీర్మానించిన సంగతిని మంత్రి గుర్తు చేశారు. చంద్రబాబు నాడు చేసిన తప్పిదం కారణంగానే ఈ సమస్య తలెత్తిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తుందని..ప్రస్తుతం పురోగతిలో ఉందని స్పష్టం చేశారు. 


Also read: AP: ఏపీలో పెట్టుబడులకు తైవాన్ కంపెనీ ఆసక్తి