AP Schools reopen effect: విద్యార్ధులు, టీచర్లకు సోకిన కరోనా

ఏపీలో స్కూళ్ల ప్రారంభం మొదటికే మోసం తెచ్చిపెట్టేలా కన్పిస్తోంది. కరోనా వైరస్ సంక్రమణ మళ్లీ వేగం పుంజుకునే ప్రమాదం పొంది ఉంచి. స్కూళ్లు ప్రారంభమైన తరువాత ఏపీలో 575 మంది విద్యార్ధులు, 829 టీచర్లకు కోవిడ్ 19 పాజిటివ్ గా తేలడంతో ఆందోళన నెలకొంది.

Last Updated : Nov 6, 2020, 02:26 PM IST
AP Schools reopen effect: విద్యార్ధులు, టీచర్లకు సోకిన కరోనా

ఏపీ ( Ap schools reopen )లో స్కూళ్ల ప్రారంభం మొదటికే మోసం తెచ్చిపెట్టేలా కన్పిస్తోంది. కరోనా వైరస్ ( Corona virus ) సంక్రమణ మళ్లీ వేగం పుంజుకునే ప్రమాదం పొంది ఉంచి. స్కూళ్లు ప్రారంభమైన తరువాత ఏపీలో 575 మంది విద్యార్ధులు, 829 టీచర్లకు కోవిడ్ 19 పాజిటివ్ గా తేలడంతో ఆందోళన నెలకొంది.

ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) లో నవంబర్ 2 నుంచి స్కూల్స్ ( Schools opened from november 2 ) ప్రారంభమయ్యాయి. రోజు విడిచి రోజు 9, 10 తరగతులతో పాటు ఇంటర్మీడియట్ క్లాసులు ప్రారంభమయ్యాయి. మరో 10-15 రోజుల్లో మిగిలిన తరగతులు కూడా ప్రారంభం కానున్నాయి. ఈ నేపధ్యంలో కోవిడ్ 19 కేసులు ఒక్కసారిగా బయటపడటంతో కలకలం రేగింది. పెద్దఎత్తున టీచర్లు, విద్యార్దులు కరోనా వైరస్ బారిన పడ్డారు. 

ఏపీ విద్యాశాఖ ( Ap Education Department ) గణాంకాల ప్రకారం… 9 లక్షల 75 వేలమంది విద్యార్ధులు 9, 10 తరగతుల్లో ఉండగా..3 లక్షల 93 వేల విద్యార్ధులు స్కూళ్లకు హాజరయ్యారు. 1 లక్షా 11 వేల టీచర్లలో  90 వేల మంది క్లాసులకు హాజరయ్యారు. తరగతులకు హాజరైన విద్యార్ధుల సంఖ్యతో పోలిస్తే..కోవిడ్ సోకిన వారి సంఖ్య అంతగా ఆందోళన కల్గించేది కాదని..కోవిడ్ 19 నిబంధనల ప్రకారం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ కమీషనర్ తెలిపారు. ప్రతి తరగతిలో కేవలం 15-6 మంది విద్యార్దులే ఉండేట్టు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 

స్కూల్స్ ప్రారంభించడంపై ఏపీ ప్రభుత్వ( Ap Government ) నిబంధనల ప్రకారం ఇంటర్ మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం , 9, 10 తరగతులు రోజు విడిచి రోజు నిర్వహిస్తున్నారు. 6,7, 8 తరగతుల్ని నవంబర్ 23 నుంచి ప్రారంభించనుంది. మరోవైపు 1 నుంచి 5 వ తరగతి వరకూ డిసెంబర్ 14 నుంచి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంది ప్రభుత్వం. లాక్డౌన్ ( Lockdown ) నేపధ్యంలో మార్చ్ నుంచి రాష్ట్రంలో అన్ని విద్యాలయాలు మూతపడిన విషయం తెలిసిందే. ఇప్పుడు స్కూల్స్ తెరిచిన అనంతరం అటు టీచర్లు, ఇటు విద్యార్ధులకు కరోనా వైరస్ సోకినట్టు తేలడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం స్కూళ్ల ప్రారంభంపై మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవల్సిన అవసరముంది. Also read: Antarvedi Temple: అంతర్వేది ఆలయంలో దర్శనాలు రద్దు

Trending News