Hindupur District Headquarter: హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలంటూ హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణ  డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇవాళ... హిందూపురంలో బాలకృష్ణ మౌనదీక్ష చేపట్టారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మొదట హిందూపురంలోని (Hindupur) పొట్టి శ్రీరాములు సర్కిల్‌ నుండి అంబేదర్క్‌ సర్కిల్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ర్యాలీలో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి. ఇక తర్వాత టీడీపీ (TDP) నేతలు, కార్యకర్తలతో కలిసి బాలకృష్ణ హిందూపురంలోని అంబేద్కర్‌‌ సర్కిల్‌లో మౌన దీక్షకు (Mouna Deeksha) దిగారు. 


ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడారు. హిందూపురాన్ని కచ్చితంగా జిల్లా కేంద్రం చేయాలని బాలకృష్ణ అన్నారు. ఇక హిందూపురం కోసం తాను దేనికైనా రెడీ అని బాలయ్య అన్నారు. అవసరమైతే తన ఎమ్మెల్యే (MLA) పదవికి కూడా రాజీనామా చేస్తానంటూ బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. 


ప్రభుత్వ పాలనకు అవసరమైన అన్ని వసతులున్నటువంటి హిందూపురాన్ని (Hindupur) జిల్లా కేంద్రంగా చేయాలంటూ ఆయన డిమాండ్‌ చేశారు. అలా కాదని వేరే చోట జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే అక్కడికి వెళ్లి కూడా ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.


కాగా ఏపీలో కొత్తగా ఏర్పాటు కాబోతోన్న సత్యసాయి డిస్ట్రిక్ట్‌ (Satyasai District‌) పుట్టపర్తిలో కాకుండా హిందూపురం (Hindupur District) కేంద్రంగా ఏర్పాటు చేయాలంటూ టీడీపీ నేతలు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ రోజు సాయంత్రం ఉద్యమ కార్యాచరణపై అఖిలపక్ష నేతలతో కూడా బాలకృష్ణ (Balakrishna) సమావేశమై చర్చించనున్నారు.


Also Read: యువతి ప్రైవేట్ పార్ట్స్ నుంచి స్వాబ్ శాంపిల్స్.. ల్యాబ్ టెక్నీషియన్‌కు పదేళ్ల జైలు


Also Read: బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తున్న పుష్ప.. 50 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook