Amaravati: యువతి ప్రైవేట్ పార్ట్స్ నుంచి స్వాబ్ శాంపిల్స్.. ల్యాబ్ టెక్నీషియన్‌కు పదేళ్ల జైలు..

Swab samples collected from girl private parts: సాధారణంగా కరోనా టెస్టుల కోసం ముక్కు లేదా గొంతు నుంచి స్వాబ్ శాంపిల్స్ సేకరిస్తారనే విషయం అందరికీ తెలిసిందే. కానీ ఓ ల్యాబ్ టెక్నీషియన్ ఓ యువతి ప్రైవేట్ పార్ట్ నుంచి స్వాబ్ శాంపిల్స్ సేకరించాడు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 4, 2022, 01:26 PM IST
  • యువతి పట్ల నీచంగా ప్రవర్తించిన ల్యాబ్ టెక్నీషియన్
  • ప్రైవేట్ పార్ట్స్ నుంచి స్వాబ్ శాంపిల్స్ సేకరణ
  • ల్యాబ్ టెక్నీషియన్‌కు పదేళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు
Amaravati: యువతి ప్రైవేట్ పార్ట్స్ నుంచి స్వాబ్ శాంపిల్స్.. ల్యాబ్ టెక్నీషియన్‌కు పదేళ్ల జైలు..

Swab samples collected from girl private parts: కరోనా టెస్టుల పేరిట ఓ యువతి పట్ల ల్యాబ్ టెక్నీషియన్ అసభ్యంగా ప్రవర్తించాడు. ముక్కు లేదా గొంతు నుంచి తీసుకోవాల్సిన స్వాబ్ శాంపిల్‌ను ఆమె ప్రైవేట్ పార్ట్స్ నుంచి తీసుకున్నాడు. అసలు అలాంటి టెస్టే ఉండదని గ్రహించిన యువతి పోలీసులను ఆశ్రయించింది. రెండేళ్లుగా దీనిపై కోర్టులో విచారణ జరుగుతూ రాగా.. తాజాగా నిందితుడికి న్యాయస్థానం పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.

వివరాల్లోకి వెళ్తే... మహారాష్ట్రలోని అమరావతి జిల్లా బద్నెరా పట్టణానికి చెందిన ఓ యువతి స్థానికంగా ఉన్న ఓ షాపింగ్ మాల్‌లో పనిచేస్తోంది. మాల్‌లో పనిచేసే ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో మిగతా సిబ్బందిని కూడా పరీక్షలు చేయించుకోవాలని మాల్ యాజమాన్యం కోరింది. దీంతో జులై 28, 2020న మాల్‌లో పనిచేసే 20 మంది సిబ్బందితో కలిసి ఆ యువతి స్థానిక మోదీ ట్రామా కేర్ హాస్పిటల్‌కి వెళ్లింది.

అక్కడ అల్కేష్ దేశ్‌ముఖ్ అనే ల్యాబ్ టెక్నీషియన్ మాల్ సిబ్బంది నుంచి స్వాబ్ శాంపిల్స్ సేకరించాడు. ఈ క్రమంలో ఆ యువతి ముక్కు నుంచి స్వాబ్ శాంపిల్ సేకరించిన అల్కేష్.. టెస్టుల్లో ఆమెకు పాజిటివ్‌గా నిర్ధాణ అయినట్లు చెప్పాడు. ఆపై ఆమె ప్రైవేట్ పార్ట్స్ నుంచి కూడా శాంపిల్స్ సేకరించాలని చెప్పాడు. అది నిజమేనని నమ్మి ఆమె అతనికి సహకరించింది. కరోనా టెస్ట్ కిట్ ద్వారా అల్కేష్ ఆమె ప్రైవేట్ పార్ట్స్ నుంచి స్వాబ్ శాంపిల్ సేకరించాడు.

ఆ యువతి ఈ విషయాన్ని తన సోదరుడితో చెప్పడంతో అతను షాక్ తిన్నాడు. ఇలాంటి టెస్టు కూడా ఉంటుందా అని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులను ఆరా తీశాడు. అలాంటి టెస్టులేమీ (Covid 19) ఉండవని తెలియడంతో బాధిత యువతి స్థానిక పోలీసులను ఆశ్రయించి అల్కేష్‌పై ఫిర్యాదు చేసింది. తన సెల్‌ఫోన్‌కు అతను అసభ్యకర మెసేజ్‌లు కూడా పంపించినట్లు ఫిర్యాదులో పేర్కొంది. అల్కేష్ వ్యవహారంపై రెండేళ్లుగా కోర్టులో విచారణ జరుగుతూ రాగా... తాజాగా న్యాయస్థానం తుది తీర్పు వెలువరించింది. అల్కేష్‌పై అభియోగాలు రుజువవడంతో అతనికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. 

Also Read: BVS Ravi tweets on PRC: ఏపీ పీర్సీపై బీవీఎస్ రవి స్పందన, ప్రజలు పతనం పరిచయం చేస్తారంటూ ట్వీట్‌!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News