Balakrishna Mouna Deeksha: నేడు బాలకృష్ణ మౌన దీక్ష.. హిందూపురాన్ని జిల్లా కేంద్రం చేయాలని డిమాండ్!

Balakrishna Deeksha in Hindupur: ఏపీ సర్కార్‌‌ కొత్త జిల్లాల ఏర్పాటుకు ముందుకెళ్తోన్న తరుణంలో జనాల నుంచి కొత్త డిమాండ్స్‌ వస్తున్నాయి. ఇదే క్రమంలో ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా హిందూపురాన్నే జిల్లా కేంద్రం చేయాలంటూ దీక్షకు దిగనున్నాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 4, 2022, 09:26 AM IST
  • కొత్త జిల్లాల ఏర్పాటుతో ఏపీ ప్రభుత్వానికి కొత్త సవాళ్లు
  • పలు ప్రాంతాల్లో తమ ప్రాంతాన్ని డిస్ట్రిక్ట్‌గా ఏర్పాటు చేయాలంటూ నిరసనలు
  • తమ ఏరియానే జిల్లా కేంద్రంగా చేయలంటూ డిమాండ్స్‌
  • హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాలంటూ బాలకృష్ణ దీక్ష
Balakrishna Mouna Deeksha: నేడు బాలకృష్ణ మౌన దీక్ష.. హిందూపురాన్ని జిల్లా కేంద్రం చేయాలని డిమాండ్!

Balakrishna Deeksha Latest News: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వానికి కొత్త సవాళ్లనే తెచ్చిపెడుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న జిల్లాలతో పాటు మరో 13 కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేసేందుకు ఏపీ సర్కార్ (AP Government) సిద్ధమైంది. అయితే కొత్త జిల్లాల ఏర్పాటుపై అభ్యంతరాల్ని స్వీకరించేందుకు కూడా ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. 

ఇప్పటికే ఏపీలో పలు ప్రాంతాల్లో తమ ప్రాంతాన్ని డిస్ట్రిక్ట్‌గా (District‌) ఏర్పాటు చేయాలంటూ నిరసనలకు దిగుతున్నారు. ఇక కొన్ని ప్రాంతాల్లో తమ ఏరియానే జిల్లా కేంద్రంగా చేయలంటూ స్థానికుల నుంచి డిమాండ్స్‌ వస్తున్నాయి.

ఇక ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటును హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఇటీవల స్వాగతించిన విషయం తెలిసిందే. అయితే బాలయ్య ఒక కొత్త డిమాండ్‌ను ఇది వరకే తెరపైకి తీసుకొచ్చారు. హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా (District Headquoter) చేయాలని బాలకృష్ణ డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మౌనదీక్షకు దిగనున్నారు. ఇక మౌనదీక్ష కోసం బాలకృష్ణ ఇప్పటికే హిందూపురానికి చేరుకున్నారు.

హిందూపురంలో ఉన్న పొట్టి శ్రీరాములు స్ట్యాట్‌ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు బాలయ్య ర్యాలీ సాగనుంది. ఇక ర్యాలీ చేపట్టాక అంబేద్కర్ విగ్రహం వద్దే బాలయ్య మౌనదీక్షకు దిగనున్నారు. అలాగే అఖిలపక్షాల నాయకులతో శుక్రవారం సాయంత్రం ఉద్యమ కార్యాచరణపై కూడా బాలకృష్ణ చర్చించనున్నారు. బాలకృష్ణ రెండు రోజుల పాటు హిందూపురంలోనే పర్యటిస్తారు. 

హిందూపురం (Hindupur) లోక్‌సభ స్థానాన్ని జిల్లా కేంద్రంగా కచ్చితంగా ప్రకటించాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తునారు. హిందూపురానికి మెడికల్ కళాశాలతో పాటు పలు విషయాల్లో అన్యాయం జరిగిందని, అందుకే హిందూపురంను జిల్లా కేంద్రంగానైనా చేయాలని స్థానికులు కోరుతున్నారు. 

ఇక ఏపీలో ఇప్పుడున్న జిల్లాలకు అదనంగా మరో పదమూడు జిల్లాలు కూడా వచ్చి చేరనున్నాయి. దీంతో ఏపీలో మొత్తం 26 జిల్లాలు కానున్నాయి. కొత్తగా ఏర్పాటు కాబోయే సత్యసాయి డిస్ట్రిక్ట్‌లో హిందూపురంను జిల్లా కేంద్రంగా చేయాలంటూ బాలకృష్ణ ఇప్పటికే డిమాండ్ చేశారు. 

హిందూపురం (Hindupur) వ్యాపారపరంగా అలాగే పారిశ్రామికంగా కూడా బాగా డెవలప్‌ అయిందని బాలయ్య ఇది వరకే చెప్పారు. హిందూపురంలో ప్రభుత్వ అవసరాలకు కావాల్సిన భూమి పుష్కలంగా ఉందని కూడా బాలకృష్ణ (Balakrishna) చెప్పారు. ఏపీలో జిల్లాల (District‌s) ఏర్పాటులో రాజ‌కీయాలు తగవని ఆయన కోరారు.

Also Read: Attack on MLA Kishan Reddy: రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి కారుపై కోడిగుడ్లతో దాడి

Also Read: ఫిబ్రవరి 5న ప్రధాని మోదీ పర్యటన.. తెలంగాణలో ముందస్తుగా భారీ బందోబస్తు!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News