ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ( Ap local body elections ) నిర్వహణపై భిన్నాభిప్రాయలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వాన్ని సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని కొన్నిపార్టీలు..తాజా నోటిఫికేషన్ ఉండాలని బీజేపీ, బీఎస్పీలు స్పష్టం చేయగా..ఎన్నికలకు సిద్ధమని టీడీపీ ( TDP ) ప్రకటించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ మరోసారి వివాదాస్పదమవుతోంది. ప్రధాన ఎన్నికల కమీషనర్ ( SEC ) ఏర్పాటు చేసిన అఖిలపక్ష భేటీ దీనికి కారణమైంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా భేటీ నిర్వహించడంపై ఆగ్రహించిన అధికారపార్టీ వైసీపీ ( ycp ) భేటీకు దూరంగా ఉంది. ఇక తెలుగుదేశం, కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, సీపీఐ, బీఎస్పీలతో ప్రధాన ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ( SEC Nimmagadda Ramesh kumar ) విడివిడిగా సమావేశమై..అభిప్రాయాలు తీసుకున్నారు. ఈ భేటీలో మిశ్రమ స్పందన వ్యక్తమైంది. ఒక్కొక్క పార్టీది ఒక్కొక్క అభిప్రాయం వెల్లడైంది.


ఎవరేమన్నారు


స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో  రాష్ట్ర ప్రభుత్వం ( Ap Government ) తో సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని సీపీఎం ( CPM ) పార్టీ తెలిపింది. వివాదాలకు తావులేకుండా వ్యవహరించాలని ఎన్నికల కమీషన్ కు ఆ పార్టీ విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వంతో సంప్రదించి స్థానిక ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలన్న సుప్రీంకోర్టు ( Supreme court ) వ్యాఖ్యలను ఈ సందర్భంగా ప్రస్తావించింది. గతంలో కరోనా వైరస్ ( corona virus ) కారణంగా ఎన్నికలు వాయిదా వేశారని.. ఇప్పుడు అంతకంటే ఎక్కువ కేసులు ఉన్నాయని సీపీఎం స్పష్టం చేసింది.  అన్ని జిల్లాల్లోనూ కంటైన్‌మెంట్ జోన్లు ఉన్నాయని..దీనికి తోడు వరదలు వచ్చాయని గుర్తు చేసింది. ఓ వైపు వ్యవసాయ పనులు జరుగుతుండటం, మరోవైపు స్కూళ్లు ప్రారంభం కానున్న నేపధ్యంలో ఈసీ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సీపీఎం సూచించింది.


సీపీఐ ఏమంది


కరోనా వైరస్ కేసుల నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అభిప్రాయాన్ని.. ఈసీ పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వంతో ఈసీ చర్చించాలని అభిప్రాయపడ్డారు. 


బీజేపీ, బీఎస్పీల అభిప్రాయం


అయితే గతంలో జరిగిన ఏకగ్రీవ ఎన్నికల్ని రద్దు చేయాలని.. తాజాగా ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయాలని బీజేపీ, బీఎస్పీలు కోరాయి. వెంటనే ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేశాయి.


తెలుగుదేశం పార్టీ స్పందన


రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిపినా సిద్ధంగా ఉన్నామని..వెంటనే ఎన్నికలు నిర్వహించాలని టీడీపీ కోరింది. గతంలో జరిగిన ఏకగ్రీవ ఎన్నికలన్నీ బెదిరించి చేసుకున్నవని..వాటిని రద్దు చేసి తాజాగా జరిపించాలని టీడీపీ అభిప్రాయం వెల్లడించింది. కేంద్ర పోలీసు బలగాల సమక్షంలో ఎన్నికలు నిర్వహించాలని కోరింది. 


కాంగ్రెస్ పార్టీ చెప్పిందేంటి


రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్‌ పార్టీ  ( Congress party ) సూచించింది. గతంలో కోవిడ్‌ నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేశారని.. ఇప్పుడు కరోనా ప్రభావం ఉందా, లేదా అనేది ఈసీనే చెప్పాలని ప్రశ్నించింది. ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు జరిగే పరిస్థితి లేదని  కాంగ్రెస్‌ పార్టీ స్పష్టం చేసింది. Also read: AP: రాజుకున్న వివాదం, ఎస్ఈసీ సమావేశంపై వైసీపీ ఆగ్రహం