ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్రధాన ఎన్నికల కమీషనర్ నిర్వహించిన అఖిలపక్ష సమావేశంపై అధికారపార్టీ విమర్శలు ఎక్కుపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారంటూ ప్రశ్నిస్తోంది.
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ వ్యవహారంలో ఏపీ ( Ap ) లో మరోసారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ( Nimmagadda Ramesh kumar ) వర్సెస్ వైఎస్ జగన్ ( ys jagan ) రగడ రాజుకుంది. స్థానిక ఎన్నికల నిర్వహణ కోసం ఎస్ఈసీ ( SEC ) ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి ముందుగా ప్రకటించినట్టే అధికారపార్టీ దూరమైంది. ప్రభుత్వాన్ని సంప్రదించకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారంటూ వైసీపీ నేత అంబటి రాంబాబు, మంత్రులు కన్నబాబు, అవంతి శ్రీనివాస్ లు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల కమీషన్ వైఖరిపై మండిపడుతున్నారు.
కరోనా వైరస్ ( Corona virus ) కారణంగా ఏపీలో స్థానిక సంస్థల ( Ap local body elections ) ఎన్నికలు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల విషయంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి ( Ap government ) , రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ( State Election commissioner ) కు మధ్య వివాదం రేగి..కోర్టు వరకూ వెళ్లింది. ఇప్పుడు మళ్లీ అదే ఎన్నికల వ్యవహారంపై మరోసారి ఇరువురి మధ్య వివాదం రేగుతోంది. ఎన్నికల్ని తిరిగి నిర్వహించేందుకు సిద్ధమైన రాష్ట్ర ఎన్నికల కమీషనర్..అఖలపక్ష సమావేశం నిర్వహించడం వివాదానికి దారి తీసింది. వైసీపీ మినహా మిగిలిన పార్టీలతో విడివిడిగా సమావేశం నిర్వహించడం కూడా అనుమానాలకు తావిస్తోంది.
నవంబర్, డిసెంబర్‌లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉండే అవకాశం ఉందని.. అప్పటి పరిస్థితిని బట్టి స్థానిక సంస్థల ఎన్నికలపై తరువాత నిర్ణయం తీసుకుంటామని మంత్రి గౌతమ్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. ఇప్పుడు తాజాగా ఎస్ఈసీ నిర్వహించిన ఎన్నికల సమావేశంపై వైసీపీ నేతలు, మంత్రులు విస్మయం వ్యక్తం చేశారు. Also read: AP High court: సీఐడీ ఎఫ్ఐఆర్ కొట్టివేయాలంటూ క్వాష్ పిటీషన్లు, విచారణపై సర్వత్రా ఆసక్తి
మంత్రి అవంతి శ్రీనివాస్ స్పందన
రాష్ట్రంలో ప్రస్తుతం స్థానిక ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదని మంత్రి అవంతి శ్రీనివాస్ ( Avanti Srinivas ) తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ( Ap Government ) సంప్రదించకుండా ఎన్నికల కమిషనర్ అఖిలపక్ష సమావేశాన్ని ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. రాష్టంలో రోజుకు రెండు, మూడు కేసులు ఉన్నప్పుడు కరోనా వంకతో ఎన్నికలు వాయిదా వేసిన కమీషనర్..ఇప్పుడు 2-3 వేల కేసులున్నప్పుడు ఎలా నిర్వహిస్తారని నిలదీశారు. నిమ్మగడ్డ రమేష్.. చంద్రబాబు ( Chandrababu ) కు అనుకూలంగా వ్యవహరించడం తగదని.. రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి ఇష్టానుసారంగా వ్యవహరిస్తామంటే కుదరదని స్పష్టం చేశారు.
అంబటి రాంబాబు ఏమన్నారు
ఎన్నికల కమిషన్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం తమకు లేదని వైసీపీ నేత ఎమ్మెల్యే అంబటి రాంబాబు ( Ambati Rambabu ) మరోసారి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయాలను తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పినా సరే..ఎస్ఈసీ ఆ ఆదేశాలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మీటింగ్ ఏర్పాటుపై ఎన్నికల కమిషనర్ కనీసం చీఫ్ సెక్రటరీని సంప్రదించలేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా రాజకీయ పార్టీలను భేటీకి పిలవడం సరైందేనా అని ప్రశ్నించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పినట్లే నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారని...పక్షపాత ధోరణి అవలంబిస్తున్నారని తెలిపారు. ఒక పార్టీకి, వర్గానికి చెందిన వ్యక్తిగా ఆయన వ్యవహరిస్తున్నారని అంబటి విమర్శించారు. రాష్ట్రంలో మూడు కోవిడ్ కేసులు కూడా లేని సమయంలో ఏ రాజకీయ పార్టీల్ని అడిగి ఎన్నికలు వాయిదా వేశారో చెప్పాలని అంబటి డిమాండ్ చేశారు.
మంత్రి కన్నబాబు చెప్పిందేంటి
రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నవ్యక్తిగా కాకుండా వ్యక్తిగతంగా, ఓ పార్టీ వ్యక్తిగా ఈసీ సమావేశం ఆశ్చర్యాన్ని కలిగించిందని మంత్రి కురసాల కన్నబాబు ( Kannababu ) చెప్పారు. అప్పటికి.. ఇప్పటికి పరిస్థితి ఏం మారిందని ఈసీ సమావేశం నిర్వహించారో చెప్పాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయాలను తీసుకోవాలని సుప్రీంకోర్టు ( Supreme court ) చెప్పినా, ఈసీ పట్టించుకోవడం లేదని కన్నబాబు విమర్శించారు. ఓ ప్రైవేటు హోటల్‌లో నిమ్మగడ్డ జరిపిన మంతనాలను ప్రజలంతా చూశారన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహార శైలి ఊహించినట్టే వివాదానికి దారితీసింది. రాజకీయ పార్టీలతో ఈసీ విడివిడిగా సమావేశం కావడంపై దుమారం రేగుతోంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఈసీ సమావేశాలు నిర్వహించడం పట్ల అన్ని వర్గాల్లోనూ విస్మయం వ్యక్తమవుతోంది. Also read: AP: రేపు జరిగే ఎస్ఈసీ సమావేశానికి అధికార పార్టీ దూరం