ఏపీ ( Ap ) లో మరోసారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ( Nimmagadda Ramesh kumar )  వర్సెస్ వైఎస్ జగన్ ( ys jagan ) రగడ ప్రారంభమయ్యేలా ఉంది. స్థానిక ఎన్నికల నిర్వహణ కోసం ఎస్ఈసీ ( SEC ) ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి అధికారపార్టీ దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. ఇప్పుడిదే కొత్త వివాదానికి దారి తీస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


కరోనా వైరస్ ( Corona virus ) కారణంగా ఏపీలో స్థానిక సంస్థల ( Ap local body elections ) ఎన్నికలు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల విషయంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి ( Ap government ) , రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ( State Election commissioner ) కు మధ్య వివాదం రేగి..కోర్టు వరకూ వెళ్లింది. ఇప్పుడు మళ్లీ అదే ఎన్నికల వ్యవహారంపై మరోసారి ఇరువురి మధ్య వివాదం రేగుతోంది. ఎన్నికల్ని తిరిగి నిర్వహించేందుకు సిద్ధమైన రాష్ట్ర ఎన్నికల కమీషనర్..అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం కావాలని నిర్ణయించింది. అయితే ఈ సమావేశానికి అధికార పార్టీ వైసీపీ ( Ruling party ycp ) దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడం సంచలనంగా మారింది. 


ఈ సమావేశం రేపు ఉదయం ఎస్ఈసీ కార్యాలయంలో జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి పార్టీల అభిప్రాయం తీసుకోవల్సి ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం వైరస్ సంక్రమణ వేగంగా ఉన్న నేపధ్యంలో ఎన్నికల నిర్వహణకు సముఖంగా లేదు. రోజూ వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నప్పుడు ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. నవంబర్, డిసెంబర్‌లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉండే అవకాశం ఉందని.. అప్పటి పరిస్థితిని బట్టి స్థానిక సంస్థల ఎన్నికలపై తరువాత నిర్ణయం తీసుకుంటామని మంత్రి గౌతమ్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు.  


సమావేశం నిర్వహించేముందు సుప్రీంకోర్టు ( Supreme court ) ఇచ్చిన తీర్పు ఏంటనేది చదువుకోవాలని వైసీపీ నేతలు నిమ్మగడ్డకు సూచించారు. ఎన్నికల ప్రక్రియను తిరిగి ప్రారంభించాలంటే రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పిందని వైసీపీ నేత అంబటి రాంబాబు చెప్పారు. మరి రేపు జరగనున్న సమావేశంలో ఎస్ఈసీ ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం లేకుండా ఎన్నికల నిర్వహణ అనేది సాధ్యం కాని పని. ఇప్పటివరకూ ఎప్పుడూ ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని విబేధించి ఎన్నికలు జరిపిన సందర్భం లేదు. Also read: AP: ఆన్‌లైన్‌ ప్రక్రియతో అన్ని అక్రమాలకు చెక్ పడనుందా