Life Threat to Pawan Kalyan: ఏపీ ఉప ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడైన పవన కళ్యాణ్ హత్యకు కుట్ర జరుగుతోందనే వార్తలు ఒక్కసారిగా కలకలం రేపుతున్నాయి. అటు అభిమానుల్లో ఇటు రాష్ట్రంలో ఆందోళన కల్గిస్తున్నాయి. మీరు కాస్త అప్రమత్తంగా ఉండమంటూ నేరుగా ఆయనకే కేంద్ర నిఘా వర్గాలు సూచించడం ఇందుకు కారణం. అసలేం జరుగుతోంది. ఏమైందనే పూర్తి వివరాలు మీ కోసం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గౌరవనీయ పవన్ కళ్యాణ్ గారూ..మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి.పూర్తి వివరాలు వెల్లడించలేం కానీ జాగ్రత్తగా ఉండాలి. ఇదీ కేంద్ర నిఘా వర్గాలు నేరుగా ఆయనకు చేసిన సూచన. ఈ సూచనలే ఇప్పుడు రాష్ట్రంలో కలకలం రేపుతున్నాయి. కేంద్ర ఇంటెలిజెన్స్ లోని కొందరితో మాట్లాడినప్పుడు లేదా రెగ్యులర్ ట్రాకింగ్ లో కొన్ని అవాంఛనీయ గ్రూపుల్లో పవన్ కళ్యాణ్ ప్రస్తావవ వచ్చినట్టు తెలిసిందని కేంద్ర నిఘా వర్గాలు తెలిపాయి. అయితే ఈ గ్రూపులు ఎవరివనే విశ్లేషణ చేసినప్పుడు కొన్ని ఆసక్తికరమైన, ఆందోళన కల్గించే అంశాలు వెలుగుచూశాయి. ఈ అంశాల కారణంగానే పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర జరగవచ్చనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అందుకే జాగ్రత్తగా ఉండాలంటూ పవన్ కళ్యాణ్ కు నిఘావర్గాలు సూచించాయి. 


పవన్ హత్యకు కుట్ర వెనుక సందేహించాల్సిన కారణాలు


పవన్ కళ్యాణ్ ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీకు సన్నిహితంగా మారడంతో పాటు ఎన్డీఏ కూటమి ఏపీలో, కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో వచ్చేందుకు కారణమయ్యారు. ఈ నేపధ్యంలో నరేంద్ర మోదీ వ్యతిరేక శక్తుల దృష్టిలో పవన్ కళ్యాణ్ ఉన్నారా అనే సందేహం మొదటిది. ఇక రెండవది పవన్ కళ్యాణ్ హిందూ ధర్మం ఆచరించడమే కాకుండా అందుకు సంబంధించిన ఆరాధనలు, ఆచార వ్యవహారాలు తూచా తప్పకుండా పాటిస్తారు. లౌకికవాదం పేరుతో తన విశ్వాసాలు, ధర్మరక్షణపై అభిప్రాయలు వెల్లడించకుండా ఉండరు. దాంతో మోదీ వ్యతిరేక శక్తులకు ఈ వ్యవహారం కంటగింపుగా మారిందనేది రెండవ అనుమానం.


ఇక ఏపీలో గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించడంతో పవన్ కళ్యాణ్ పాత్ర కీలకం కావడంతో ఆ వర్గాల సంభాషలు నిఘా వర్గాల దృష్టికి వచ్చాయా అనేది తెలియాల్సి ఉంది. ఎన్నికలకు ముందు కూడా పవన్ కళ్యాణ్ రాజకీయ విధానాలను మావోయిస్టు నాయకుడు తప్పుబడుతూ ప్రకటన విడుదల చేయడం మరో కారణం కావచ్చు. బీజేపీ కూటమితో కలిసి ప్రయాణం చేయడాన్ని మావోయిస్టులు వ్యతిరేకించిన పరిస్థితి ఉంది. ఈ దిశగా మావోల సంభాషణ ఉందా అనేది తెలియాల్సి ఉంది. 


మొత్తానికి పక్కా కారణాలు ఏమున్నాయో గానీ నిఘా వర్గాలు అప్రమత్తంగా ఉండమని సూచించడం అంత తేలిగ్గా తీసుకునే విషయం కాదని తెలుస్తోంది. తమ  అభిమాన నేతకు ప్రాణ హాని ఉందనే వార్తలు ఆందోళన కల్గిస్తున్నాయి. తమ నాయకుని రక్షణ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సి ఉంది. 


Also read: YS Jagan: వినుకొండలో రషీద్ కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook