Tirupati Lok Sabha: తిరుపతి లోక్‌సభకు జరగనున్న ఎన్నికల్లో జనసేన మళ్లీ ప్రచారానికే పరిమితం కానుందా..బీజేపీ ఒత్తిడితో ఈసారి కూడా పోటీకు దూరం కానుందా. పరిస్థితి చూస్తే అవుననే అన్పిస్తోంది. రీడ్ ద స్టోరీ..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) తిరుపతి లోక్‌సభ ( Tirupati lok sabha ) స్థానానికి త్వరలో ఉప ఎన్నిక ( Bypoll ) జరగనుంది.  బీజేపీ జనసేన పార్టీల్లో పోటీ చేసేది ఎవరనేది ఆసక్తి రేపుతోంది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ( Janasena president pawan kalyan ) ఢిల్లీ పర్యటన అనంతరం ఈ ప్రశ్న రావడం సహజమే. ఎందుకంటే దుబ్బాక ఉప ఎన్నికలో ( Dubbaka Bypoll ) జనసేన ( Janasena ) పోటీకు దూరంగా ఉంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మాత్రం..ముందు పోటీ చేస్తానని ప్రకటించి..తరువాత పోటీ నుంచి తప్పుకుంది జనసేన. 


అనంతరం తిరుపతి ఉప ఎన్నిక ( Tirupati Bypoll ) ల్లో జనసేన అభ్యర్ధే బరిలో ఉంటాడంటూ భారీగా ప్రచారం సాగింది. కానీ ఇప్పుడు  పరిస్థితి అలా కన్పించడం లేదు. ఇటీవల పవన్ కళ్యాణ్, బీజేపీ నేతల ఉమ్మడి సమావేశం జరిగింది. ఆ తరువాత తిరుపతి కేంద్రంగా బీజేపీ ( Bjp ) జోరెక్కువైంది. 


తిరుపతి లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో బూత్ స్థాయి నుంచి పక్కా వ్యూహం అమలు చేస్తోంది బీజేపీ. 45 మండలాల బూత్ కమిటీల బాధ్యతల్ని 15 మంది నేతలకు అప్పగించి..క్షేత్రస్థాయిలో పట్టు బిగించాలని ఆలోచిస్తోంది. ఏపీ బీజేపీ ఛీఫ్ సోము వీర్రాజు ( Ap bjp chief somu veerraju ) కూడా ఇటీవలి కాలంలో తిరుపతి పర్యటనకు ప్రాధాన్యత ఇస్తున్నారు. జాతీయస్థాయి నేతల్ని తిరుపతికి రప్పిస్తున్నారు. పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్డ్ సునీల్ దేవ్‌ధర్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్ని సైతం తిరుపతిలోనే ఏర్పాటు చేశారు. 


ఇదంతా చూస్తున్న మిత్రపక్షం జనసేన కార్యకర్తలకు ఏం అర్ధం కావడం లేదు. తిరుపతి పర్యటనలో కూడా పవన్ కళ్యాణ్ ( pawan kalyan ) ఎన్నికల విషయంలో ఏ ప్రకటనా చేయకపోవడం విశేషం. అటు గత ఎన్నికల్లో కూడా జనసేన పోటీ చేయకుండా..అప్పటి మిత్రపక్షం బీఎస్పీకు మద్దతిచ్చి...20 వేల ఓట్లు సాధించింది. అటు అదే ఎన్నికల్లో ఒంటరిగా బరిలో దిగిన బీజేపీకు 16 వేల ఓట్లు వచ్చాయి. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే..తిరుపతి లోక్‌సభ స్థానం నుంచి బీజేపీనే పోటీ చేసే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. జనసేన పార్టీ మరోసారి ప్రచారానికే పరిమితమయ్యేలా ఉంది. 


Also read: AP: రేపు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్