AP: రేపు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు పోలవరం పర్యటించనున్నారు. 2021 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న నేపధ్యంలో జగన్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

Last Updated : Dec 13, 2020, 01:12 PM IST
AP: రేపు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు పోలవరం పర్యటించనున్నారు. 2021 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న నేపధ్యంలో జగన్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) జీవనరేఖ, ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టు ( Polavaram project )ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు సందర్శించనున్నారు. ఈ సందర్బంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి.  పోలవరం నిర్మాణ పనులతో పాటు స్పిల్ వే, స్పిల్ చానల్ పనులను వైఎస్ జగన్  ( Ap cm ys jagan ) స్వయంగా పరిశీలించనున్నారు. అనంతరం పోలవరం నిర్మాణ పనులపై వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. 2021 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. అటు పోలవరం ఎత్తును కూడా ఒక్క అంగుళం కూడా తగ్గించే ప్రసక్తే లేదని చెప్పింది. 

ఇప్పటివరకూ పోలవరం ప్రాజెక్టు  నిర్మాణంలో..స్పిల్ వే ( Polavaram spill way )కు సంబంధించి 2 లక్షల 17 వేల 443 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని పూర్తయింది. స్పిల్ వే పిల్లర్లపై 160 గడ్డర్లను 52 మీటర్ల ఎత్తులో నిర్మించారు. గేట్ల ఏర్పాటు లో కీలకమైన 48 ట్రూనియన్ భీంలలో..30 ట్రూనియన్ భీమ్ ల నిర్మాణం పూర్తయింది. కరోనా సంక్షోభ సమయంలో కూడా స్పిల్ ఛానల్ లో 1 లక్షా 10 వేల 33 క్యూబిక్ మీటర్ల పని పూర్తయింది. అటు 10 లక్షల 64 వేల 417 క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకం పని పూర్తయింది. 

పోలవరం ప్రాజెక్టు ( Polavaram project ) నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పూర్తిగా ప్రయత్నాలు చేస్తున్నారు. సవరించిన అంచనా వ్యయం విషయంలో గత ప్రభుత్వం తప్పులు చేసిందని ఇప్పటికే జగన్ ప్రభుత్వం ఆరోపించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏడాదిలోగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. Also read: APPSC Group 1 Mains Exam 2020 Date: ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల తేదీలివే

Trending News