AP: పోలవరం నిర్మాణాన్ని కేంద్రమే పూర్తి చేస్తుంది: బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు
ఆంధ్రప్రదేశ్ జీవనరేఖ పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన..రాజధాని అంశంపై చంద్రబాబుపై మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ జీవనరేఖ పోలవరం ప్రాజెక్టు ( Ap lifeline polavaram project ) నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ( Ap bjp president somu veerraju ) స్పష్టం చేశారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన..రాజధాని అంశంపై చంద్రబాబుపై మండిపడ్డారు.
ప్రతిష్ఠాత్మక పోలవరం ప్రాజెక్టు మరోసారి చర్చనీయాంశమవుతోంది. 2013-14లో సవరించిన అంచనా ప్రకారమే ఆమోదం తెలుపనుందని వార్తలు వచ్చిన నేపధ్యంలో పోలవరం అంశం ( Polavaram issue ) పై మళ్లీ రాజకీయం వేడెక్కుతోంది. గత ప్రభుత్వం కమీషన్ల కోసం చేసిన పనుల కారణంగానే ఈ దుర్గతి పట్టిందనేది వైసీపీ ( ysrcp ) నేతల ఆరోపణ. ఈ నేపధ్యంలో బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. జాతీయ ప్రాజెక్టు హోదాలో పోలవరం నిర్మాణానికి కేంద్రమే నిధులు కేటాయించి పూర్తి చేస్తుందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం డబ్బులు తగ్గించేస్తుందంటూ ఇటీవల ఏవేవో కథనాలు పేపర్లలో వస్తున్నాయని.. ఎందుకో కొందరు అయోమయానికి గురై ప్రజల్ని ఇలా గందరగోళంలోకి నెడుతున్నారన్నారు. ఏపీ ప్రభుత్వం కేవలం నిర్మాణ ఏజెన్సీ మాత్రమేనని.. ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ఉందని వీర్రాజు చెప్పారు.
మరోవైపు అమరావతి ( Amaravati issue ) అంశంపై మాట్లాడిన సోము వీర్రాజు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ( Chandrababu ) పై మండిపడ్డారు. అమరావతి విషయంలో బీజేపీ ( BJP ) ని వేలెత్తి చూపే ప్రయత్నం జరుగుతోందని.. అసలు ఐదేళ్ల పాటు సీఎంగా ఉన్న చంద్రబాబు అమరావతి అభివృద్ధికి ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. రాజధాని కోసం కేంద్రం నిధులు ఇవ్వడంతో పాటు హడ్కో నుంచి కూడా రుణం ఇప్పించిందన్నారు. అప్పట్లో వచ్చిన 7 వేల 200 కోట్ల నిధులను చంద్రబాబు ఎక్కడ ఖర్చు పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. కర్నూలులో హైకోర్టు నిర్మాణానికి తీర్మానం చేసింది బీజేపీనేనని ఆయన స్పష్టం చేశారు.
అమరావతి అభివృద్ధికి భూములిచ్చిన రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం 64 వేల ప్లాట్లను అందించాలని ఏపీ ప్రభుత్వాన్ని( Ap government ) డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ విదేశీ పర్యటన సందర్బంగా లండన్ సంస్థ ఒకటి అమరావతిలో పెద్ద హాస్పిటల్ నిర్మాణానికి ముందుకొస్తే..గత ప్రభుత్వం మాయచేసిన పంపించేసిందని ఆరోపించారు. అంతేకాకుండా విజయవాడ కనకదుర్గ ఫ్లై ఓర్ విషయంలో కూడా 420 కాంట్రాక్టర్ కు పనులప్పగించి కాలయాపన చేసిందని గత టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. Also read: Andhra Pradesh: మందుబాబులకు షాక్.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం