Andhra Pradesh: మందుబాబులకు షాక్.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌ ( Andhra Pradesh ) లో మద్యం ధరలు అధికంగా ఉండటంతో.. మద్యం ప్రియులు సరిహద్దుకు దగ్గరగా ఉన్న వేరే రాష్ట్రాలను ఆశ్రయిస్తున్నారు. దీంతోపాటు దళారి వ్యాపారులు సైతం వేరే రాష్ట్రాల నుంచి భారీగా మద్యం బాటిళ్ల ( Illicit Liquor ) ను అక్రమంగా ఏపీకి తరలిస్తూ లక్షలు దండుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మరోసారి మందుబాబులకు షాక్ ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Last Updated : Oct 27, 2020, 10:54 AM IST
Andhra Pradesh: మందుబాబులకు షాక్.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

AP Govt Imposes ban to other state Liquor: అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ( Andhra Pradesh ) లో మద్యం ధరలు అధికంగా ఉండటంతో.. మద్యం ప్రియులు సరిహద్దుకు దగ్గరగా ఉన్న వేరే రాష్ట్రాలను ఆశ్రయిస్తున్నారు. దీంతోపాటు దళారి వ్యాపారులు సైతం వేరే రాష్ట్రాల నుంచి భారీగా మద్యం బాటిళ్ల ( Illicit Liquor ) ను అక్రమంగా ఏపీకి తరలిస్తూ లక్షలు దండుకుంటున్నారు. ఈ క్రమంలో ఏపీ పోలీసులు కోట్లాది రూపాయల మద్యాన్ని ( Liquor) ఇప్పటికీ పట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మరోసారి మందుబాబులకు షాక్ ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇతర రాష్ట్రాల నుంచి జోరుగా మద్యం ఏపీకి వస్తున్న నేపథ్యంలో అక్రమ మద్యానికి అడ్డుకట్టవేసేందుకు ఎక్సైజ్‌ శాఖ (Prohibition and Excise Department).. కొత్తగా జీవో నెంబర్ 310 (GO) ను విడుదల చేసింది. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకోవడంపై కఠినతరమైన ఆంక్షలు విధిస్తూ.. ఏపీ ప్రభుత్వం (AP Govt) సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 

పర్మిట్, లైసెన్స్ లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకునేందుకు వీల్లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఈ కొత్త జీవో అమలు కావడం వల్ల గతంలో మాదిరిగా మూడు మద్యం బాటిల్స్ తెచ్చుకునేందుకు కూడా అనుమతి ఉండదు. అయితే ఇతర దేశాల మద్యాన్ని కేంద్రం నిబంధనల ప్రకారం అనుమతించనున్నట్లు పేర్కొంది. అయితే ఈ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. Also read: AP High Court: మద్యం ప్రియులకు ఉపశమనం.. మూడు బాటిళ్లు తెచ్చుకోవచ్చు

ఇదిలాఉంటే.. ఇతర రాష్ట్రాల నుంచి మద్యాన్ని తీసుకుని వచ్చే వెసులుబాటు ఉన్నప్పటికీ.. ఏపీ పోలీసులు కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ రెండు నెలల క్రితం రిట్ పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. అయితే దీనిపై విచారించిన హైకోర్టు (AP high court ) ఇతర రాష్ట్రాల నుంచి మూడు మద్యం సీసాలు (liquor bottle) తీసుకువచ్చేలా.. జీవో 411 అమలు చేయాలని సెప్టెంబరు 2న ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే.   Also read: Weather updates: 29న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

 

Trending News