AP: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు అస్వస్థత ఘటనపై కేంద్రం స్పందించింది. కేంద్ర హోంశాఖ వివరాల్ని అడిగి తెలుసుకుంది. అవసరమైన సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh )లోని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ( Eluru )లో అంతుచిక్కని వింత వ్యాధి ( Unknown disease )పట్టి పీడిస్తోంది. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి అస్వస్థకు గురైన వారి సంఖ్య 270కు చేరుకుంది. 117 మందిని డిశ్చార్జ్ చేయగా..మిగిలినవారు కోలుకుంటున్నారు. మరో పదిమందిని మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు. ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని ( Minister Alla nani ) స్వయంగా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. 


వింత వ్యాధి లక్షణాలు కనిపించిన ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. వైద్య బృందం.. ఇంటింటికి ఆరోగ్య సర్వే చేపట్టారు. పరీక్షల కోసం శాంపిల్స్ ను వైరాలజీ ల్యాబ్ కు పంపించారు. ఫిట్స్ లక్షణాలతో చేరిన బాధితులకు ప్రాణాపాయం లేదని వైద్యలు తెలిపారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో అదనపు బెడ్స్ ఏర్పాటు చేశారు.  


నీరు, ఫుడ్ పాయిజన్‌ లాంటివేవీ జరగలేదని మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. విజయవాడ ఎయిమ్స్ నుంచి ప్రత్యేక వైద్య బృందం వచ్చిందని.. నిపుణుల బృందాలు కూడా ఏలూరు వస్తున్నాయని చెప్పారు. మరోవైపు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) పరామర్శించనున్నారు.


ఇక ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ ( Central Home ministry ) స్పందించింది. ఘటనకు సంబంధించిన వివరాలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ( central minister kishan reddy ) ఆరా తీశారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నితో ఫోన్‌లో మాట్లాడి...అవసరమైన మేరకు కేంద్ర వైద్య బృందం సహాయం అందించేందుకు సిద్ధంగా ఉందన్నారు. Also read: AP: రాష్ట్రంలో పాల రాజకీయం, హెరిటేజ్ వర్సెస్ అమూల్ ప్రాజెక్టు