Chandrababu Case Updates: చంద్రబాబు జెయిల్ భవితవ్యం తేలేది రేపే, క్వాష్‌పై రేపు తీర్పు
Chandrababu Case Updates: ఏపీ స్కిల్ కుంభకోణం కేసులో రేపు కీలక పరిణామం జరగనుంది. స్కిల్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు క్వాష్ పిటీషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు రేపు రానుంది. చంద్రబాబుకు జెయిల్ ఉంటుందా లేదా అనేది రేపు తేలిపోనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Chandrababu Case Updates: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో అరెస్ట్ అయిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు 52 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అనంతరం ఆరోగ్య కారణాలతో 4 వారాల మద్యంతర బెయిల్‌పై బయటికొచ్చారు. చంద్రబాబుకు జెయిల్ ఉంటుందా లేదా అనేది రేపు తేలిపోనుంది.
ఏపీ స్కిల్ కుంభకోణం కేసులో నిందితుడైన టీడీపీ అధినేత చంద్రబాబు భవితవ్యం రేపు తేలిపోనుంది. ఈ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు తన అరెస్ట్ అక్రమమని కొట్టివేయాలని కోరుతూ పిటీషన్ దాఖలు చేశారు. ఏసీబీ కోర్టులో రెండ్రోజులపాటు సాగిన వాదన అనంతరం క్వాష్ పిటీషన్ కొట్టివేసిన దిగువ కోర్టు రిమాండ్ విధించింది. అనంతరం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు చంద్రబాబు తరపు న్యాయవాదులు. సుప్రీంకోర్టు నుంచి లీడింగ్ న్యాయవాదులు వచ్చి వాదించారు. ఏపీ హైకోర్టు సైతం క్వాష్ పిటీషన్ కొట్టివేసింది. ఆ తరువాత సుప్రీంకోర్టులో సవాలు చేశారు. సుప్రీంకోర్టులో జస్టిస్ అనిరుధ్ బోస్, జస్టిస్ ఎం త్రివేదిల ధర్మాసనం 3-4 దఫాలుగా పూర్తి స్థాయిలో వాదనలు విన్నది.
చంద్రబాబు తరపున హరీష్ సాల్వే, సిద్ధార్ధ్ లూధ్రా వాదనలు విన్పించగా, సీఐడీ తరపున ముకుల్ రోహత్గీ వాదించారు. కోర్టులో వాదనలన్నీ సెక్షన్ 17ఏ చుట్టూనే సాగాయి. సెక్షన్ 17ఏ చంద్రబాబుకు వర్తిస్తుందని, కేసు కొట్టివేయాలని చంద్రబాబు తరపు న్యాయవాదుల వాదించారు. అయితే ముకుల్ రోహత్గీ మాత్రం చంద్రబాబుకు ఈ సెక్షన్ వర్తించదని స్పష్టం చేశారు. సెక్షన్ 17ఏ అనేది కేవలం నిజాయితీ కలిగిన ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులకు మాత్రమే వర్తిస్తుందని, ఈ కేసులో నేరం జరిగిందని చెప్పేందుకు ప్రాధమిక ఆధారాలున్నాయని స్పష్చం చేశారు. ఈ కుంభకోణం జరిగిన 2015-16 సమయంలో సెక్షన్ 17 ఏ లేదని ముకుల్ రోహత్గీ గుర్తు చేశారు. అవినీతిపరులకు ఈ సెక్షన్ రక్షణ కవచం కాకూడదన్నారు.
ఈ కేసులో సుప్రీంకోర్టులో పెద్దఎత్తున వాదనలు జరిగాయి. పూర్తి స్థాయిలో వాదనల అనంతంర సుప్రీంకోర్టు తీర్పు రేపటికి రిజర్వ్ చేసింది. అంటే రేపు నవంబర్ 8వ తేదీన చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటీషన్‌పై కోర్టు తీర్పు వెల్లడించనుంది. ఒకవేళ క్వాష్ కొట్టివేస్తే చంద్రబాబు నాయుడు మద్యంతర బెయిల్ అనంతరం తిరిగి జైలుకు రావల్సిందే. ఒకవేళ క్వాష్ అంగీకరిస్తే చంద్రబాబు జెయిల్ రద్దు కావచ్చు.
Also read: Chandrababu Eye Operation: ఎల్‌వి ప్రసాద్ ఐ ఆసుపత్రిలో చంద్రబాబుకు కంటి ఆపరేషన్ సక్సెస్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook