Chandrababu Naidu aggressive comments on Andhrapradesh Election Commission: ఏపీ ఎన్నికల కమిషన్‌ స్వతంత్రంగా పనిచేస్తోందా అని ప్రశ్నించారు టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu). దీపావళి రోజున నామినేషన్లు వేయమనడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. ఆంధ్రప్రదేశ్‌లో మిగిలిన స్థానిక సంస్థల్లో ఎన్నికల నిర్వహణ ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) (State Election Commission‌) నేటి నుంచే ప్రారంభించడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) స్వతంత్రంగా వ్యవహరిస్తోందా అని ప్రశ్నించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read : Jagananna sampoorna gruha hakku : త్వరలో ప్రారంభంకానున్న జగనన్న సంపూర్ణ గృహ హక్కు రిజిస్ట్రేషన్లు


ఇక నామినేషన్లు (Nominations) వేయొద్దని స్వయంగా పోలీసులు హెచ్చరించడం దుర్మార్గమని మండిపడ్డారు. ఒకప్పుడు నామినేషన్లలో తప్పొప్పులు ఉంటే సరిచేసే వారని.. ఇప్పుడు నామినేషన్లు ఏకంగా డిస్‌క్వాలిఫై చేస్తున్నారని విమర్శించారు. ఆర్వోలు డ్రామాలు ఆడితే ఊరుకోబోమని హెచ్చరించారు. ఏపీలో (AP) అరాచక పాలన కొనసాగుతోందని మండిపడ్డారు. 


నామినేషన్ల దాఖలుకు ముందు, తర్వాత సోషల్‌ మీడియాలో పెట్టడంటూ తమ పార్టీ నేతలకు సూచించారు. నామినేషన్లు (Nominations) దాఖలు చేసే సమయంలో న్యాయవాదుల సలహాలు తీసుకోవాలంటూ పార్టీ నేతలను ఆదేశించారు. అలాగే బెదిరింపు ఫోన్‌ కాల్స్‌ వస్తే రికార్డు చేయాలంటూ తెలుగుదేశం పార్టీ వారికి సూచించారు. ఇక అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు రావాంటూ సవాలు విసిరారు చంద్రబాబు(Chandrababu).


Also Read : Petro-Diesel Price: పెట్రోల్ ధర బారెడు పెంచి.. చిటికెడు తగ్గించారు.. ఇదేం న్యాయం..??


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook