Chandrababu Naidu: తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఆత్మ పరిశీలనలో దిగింది. ఎన్నికలకు దూరంగా ఉండాలనే నిర్ణయాన్ని మార్చుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని తిరిగి నిర్ణయించుకుంది. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఏమన్నారంటే.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం(Telugudesam)పార్టీ గత కొద్దికాలంగా రాష్ట్రంలో జరుగుతున్న వివిధ ఎన్నికలకు దూరంగా ఉంటోంది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు, మొన్న జరిగిన బద్వేలు ఉపఎన్నికకు దూరంగా ఉంది. టీడీపీ ఎన్నికల బహిష్కరణ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తాయి. సొంతపార్టీలోనే చాలామంది నేతలకు చంద్రబాబు నిర్ణయం నచ్చలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు నిర్ణయాన్ని కాదని కొంతమంది బరిలో నిలిచారు. బద్వేలు ఉపఎన్నిక పోటీ నుంచి తప్పుకోవడంపై పార్టీలో అసహనం పెరిగింది. వరుస ఓటములకు భయపడి ఎన్నికలకు దూరంగా ఉంటుందని దాదాపుగా అందరికీ అర్ధమైంది. ఈ క్రమంలో ఆయనపై ఒత్తిడి పెరిగింది.
రాష్ట్రంలో వివిధ కారణాలతో ఆగిపోయిన స్థానిక సంస్థల ఎన్నికల (Local Body Election Notification)నిర్వహణకు నోటిఫికేషన్ వెలువడింది. గతంలో పరిషత్ ఎన్నికల్ని తెలుగుదశం బహిష్కరించిన నేపధ్యంలో ఈ ఎన్నికల్లో కూడా అంతేనా అనేత సందిగ్దత నెలకొంది. ఈసారి కచ్చితంగా పోటీ చేయాల్సిందేనని ఒత్తిడి వచ్చింది. పార్టీ నేతల ఒత్తిడి మేరకు చంద్రబాబు నాయుడు(Chandrababu naidu)నిర్ణయం మార్చుకున్నారు. ఈసారి ఎన్నికల్లో బరిలో నిలుస్తున్నట్టు చెప్పడంతో పార్టీ వర్గాలు ఊపిరిపీల్చుకున్నారు. పోటీకు దూరంగా ఉండి గతంలో చేసిన తప్పును మరోసారి చేయకూడదనే పార్టీ నేతల సూచనను చంద్రబాబు అంగీకరించారని తెలుస్తోంది. రాష్ట్రంలో వివిధ కారణాలతో నిలిచిపోయిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని(Tdp to contest in local elections)..అన్ని స్థానాల్లో అభ్యర్ధుల్ని బరిలో నిలపాలని టీడీపీ నిర్ణయించుకుంది.
Also read: Badvel By Election Dasari Sudha wins: బద్వేలు ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ భారీ విజయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి