Supreme Court: మూడు నెలలుగా ఆసక్తి రేపుతూ ఉత్కంఠ కల్గించిన చంద్రబాబు క్వాష్ పిటీషన్ తీర్పు ఎట్టకేలకు వెలువడింది. కానీ ద్విసభ్య ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఫలితం తేలకపోవడంతో కేసు కాస్తా మొదటికొచ్చింది. సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ బెంచ్‌కు బదిలీ చేస్తూ ద్విసభ్య ధర్మాసనం తుది తీర్పు ఇచ్చింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ స్కిల్ కుంభకోణం కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటీషన్‌లో ఇవాళ  కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఎ కింద గవర్నర్ ముందస్తు అనుమతి తీసుకోకుండా అరెస్టు చేశారని. అందుకే ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ క్వాష్ పిటీషన్ తొలుత ఏసీబీ కోర్టులో దాఖలు చేశారు. ఏసీబీ కోర్టు ఆ పిటీషన్ కొట్టివేయడంతో హైకోర్టును ఆశ్రయించారు.సెప్టెంబర్ 22వ తేదీన హైకోర్టు సైతం క్వాష్ పిటీషన్ కొట్టివేయడంతో మరుసటి రోజున సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేశారు. ఈ కేసును జస్టిస్ అనిరుధ్ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిల ధర్మాసనం సుదీర్ఘంగా విచారించింది. చాలా పర్యాయాలు రోజంతా వాదనలు జరిగాయి. అన్ని కోణాల్లో కేసుపై వాదనలు విన్న తరువాత విచారణ ముగించిన సుప్రీంకోర్టు అక్టోబర్ 17వ తేదీన తీర్పు వాయిదా పడింది. ఇవాళ వెలువడిన తీర్పులో దిసభ్య ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. 


ఈ కేసులో చంద్రబాబుకు సెక్షన్ 17ఏ వర్తిస్తుందని జస్టిస్ అనిరుద్ బోస్ తెలిపారు. అదే సమయంలో రిమాండ్ అధికారం ట్రయల్ కోర్టుకు ఉంటుందని, రిమాండ్ కోర్టు విచారణలో జోక్యం చేసుకోజాలమని చెప్పారు. అంటే సెక్షన్ 17ఎ వర్తించినంత మాత్రాన కేసు మెరిట్స్ కాదనలేమనేది జస్టిస్ అనిరుధ్ బోస్ అభిప్రాయంగా ఉంది. 


ఇక మరో న్యాయమూర్తి జస్టిస్ ఎం బేలా త్రివేది మాత్రం ఈ కేసులో సెక్షన్ 17ఎ చంద్రబాబుకు వర్తించదని తెలిపారు. ఇలా ఇద్దరూ బిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో సెక్షన్ 17ఏ పై ఎలాంటి తీర్పు ఇవ్వలేదు. కేసును సుప్రీంకోర్టు సీజేఐ బెంచ్‌కు బదిలీ చేశారు. 


Also read: Chandrababu Naidu Case Live Updates: సర్వత్రా ఉత్కంఠ.. చంద్రబాబు కేసులో సుప్రీం తీర్పు ఇదే..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook