Chandrababu Naidu Case Live Updates: సర్వత్రా ఉత్కంఠ.. చంద్రబాబు కేసులో సుప్రీం తీర్పు ఇదే..!

Chandrababu Skill Development Scam Case Live Updates: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్‌పై సుప్రీం కోర్టులో మరి కాసేపట్లో తీర్పు వెల్లడికానుంది. ఈ పిటిషన్‌పై ఇప్పటికే సుప్రీం కోర్టులో వాదనలు ముగిశాయి. ఈ కేసు లైవ్ అప్‌డేట్స్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.  

Written by - Ashok Krindinti | Last Updated : Jan 16, 2024, 05:33 PM IST
Chandrababu Naidu Case Live Updates: సర్వత్రా ఉత్కంఠ.. చంద్రబాబు కేసులో సుప్రీం తీర్పు ఇదే..!
Live Blog

Chandrababu Skill Development Scam Case Live Updates: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం నేడు తీర్పు వెలువరించనుంది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో ఏపీ సీఐడీ తన మీద నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ సుప్రీం కోర్టులో చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై చంద్రబాబు తరఫున ఇప్పటికే సర్వోన్నత న్యాయస్థానంలో వాదనలు ముగిశాయి. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్‌ అనిరుద్ధబోస్‌, జస్టిస్‌ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం.. అక్టోబరు 17న తీర్పు వాయిదా వేసింది. ఈ తీర్పుపై రాజకీయవర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. మరోవైపు 'స్కిల్‌' కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్‌ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ.. రాష్ట్రం ప్రభుత్వం కూడా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఫైబర్ నెట్ కేసు, బెయిల్ పిటిషన్ ఈ నెల 17, 18 తేదీల్లో విచారణకు రానున్నాయి. ఈలోపే క్వాష్ పిటిషన్‌పై సుప్రీం ధర్మాసనం మంగళవారం తీర్పును వెల్లడించనుంది.

16 January, 2024

  • 17:32 PM

    Chandrababu Naidu Case Live Updates: చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో 17A సుప్రీం కోర్టు భిన్నాభిప్రాయాలపై సీపీఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడుపై ఉన్న స్కిల్ డెవలప్మెంట్ కేసులో 17A వర్తిస్తాదా, వర్తించదా అనే అంశంపై ఈరోజు తీర్పు రావాల్సి ఉన్నా..  సుప్రీం కోర్టులో భిన్నాభిప్రాయం వెలువడిందని..  ముమ్మాటికి ఇందులో రాజకీయ జోక్యం చోటుచేసుకుందన్నారు. బీజేపీకి ఎవరైతే అనుకూలంగా ఉన్నారో వాళ్లపై కేసులు ఉండవని.. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, ఆ పార్టీ నాయకులు మీద ఎప్పుడు గానీ కత్తులు వేలాడుతూనే ఉంటుందని ఆరోపించారు. ఆ తరహాలోనే ఈ కేసులో కూడా 17A వర్తిస్తాదా-వర్తించదా అనే అంశం వేలాడుతూనే ఉంటుందే తప్ప ఒక కొలిక్కి వచ్చేదానికి అవకాశం లేదని స్పష్టం చేశారు. ఇందులో న్యాయ వ్యవస్థ కూడా ఒక రకమైన గేమ్‌ను ఆడుతుందని  తాను అభిప్రాయపడుతున్నట్లు తెలిపారు. 

  • 13:33 PM

    Chandrababu Naidu Case Live Updates: 17A అన్వయించడంలో తమకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయని జస్టిస్ అనిరుద్ద్ బోస్ తెలిపారు. తగిన నివేదిక కోసం చీఫ్‌ జస్టిస్‌కు నివేదిస్తున్నామన్నారు. 
     

  • 13:29 PM

    Chandrababu Naidu Case Live Updates: 17A పిటిషన్‌పై ద్విసభ్య ధర్మాసనం ఎలాంటి తీర్పు వెల్లడించలేదు. విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలని సీజేఐకి విన్నవించారు. చంద్రబాబు 17A రాజ్యాంగ ధర్మాసనం ముందుకు వెళ్లే అవకాశం ఉంది.

  • 13:22 PM

    Chandrababu Naidu Case Live Updates: సుప్రీం ద్విసభ్య ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. చంద్రబాబు నాయుడికు 17A వర్తిస్తుందని జస్టిస్ అనిరుద్ధబోస్‌ చెప్పగా.. 17A వర్తించదని జస్టిస్‌ బేలా ఎం.త్రివేది అన్నారు. చంద్రబాబు కేసును త్రిసభ్య ధర్మసనానికి బదిలీ చేశారు. సీజేఐ బెంచ్‌కు పిటిషన్ బదిలీ చేశారు.

  • 13:17 PM

    Chandrababu Naidu Case Live Updates: జస్టిస్‌ అనిరుద్ధబోస్‌, జస్టిస్‌ బేలా ఎం.త్రివేదిల ధర్మాసనం విడివిడిగా తీర్పు వెల్లడిస్తున్నారు. ముందుగా జస్టిస్ అనురుద్దబోస్ తీర్పు చదువుతున్నారు.

  • 13:15 PM

    Chandrababu Naidu Case Live Updates: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై ధర్మాసనం తీర్పు చదువుతోంది. సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
     

  • 12:56 PM

    Chandrababu Naidu Case Live Updates: చంద్రబాబు అరెస్ట్‌పై 17-ఏ వర్తిస్తుందా..? లేదా అనే దానిపై సుప్రీం తీర్పు వెల్లడించనుంది. సీఐడీ తరపున సీనియర్ లాయర్లు ముకులు రోహత్గీ, రంజిత్ కుమార్‌.. చంద్రబాబు తరఫున హరీష్ సాల్వే, సిద్దార్థ లూథ్రా వాదనలు వినిపించారు.

Trending News