CM Jagan Davos: ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా వెళ్లిన సీఎం జగన్మోహన్ రెడ్డి టీమ్ దావోస్ లో ల్యాండైంది. గన్నవరం విమానాశ్రయం నుంచి శుక్రవారం బయలుదేరిన సీఎం జగన్.. సాయంత్రం జ్యూరిచ్ చేరుకున్నారు. అక్కడి నుంచి రాత్రి దావోస్ వెళ్లారు. ఏపీ సీఎం జగన్ తో పాటు ఫైనాన్స్ మినిస్టర్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి ఉన్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారులు ముఖ్యమంత్రి దావోస్ పర్యటనలో ఉన్నారు. ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ రెడ్డి, ఏపీఐఐసీ చైర్మెన్ మొట్టు గోవిందరెడ్డితో పాటు సీఎంవోలోని కొందరు అధికారులు రెండు రోజుల క్రితమే దావోస్ వెళ్లారు. పెట్టుబడుల సాధనే లక్ష్యంగా దావోస్ లో ఏపీ పెవిలియన్ ఏర్పాటు చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈనెల 26 వరకు దావోస్ లోనే ఉండనున్నారు ఏపీ సీఎం జగన్. పలు  కీలక సమావేశాలు జరపనున్నారు. ఈనెల 23న వైద్యరంగంపై జరిగే సదస్సులో పాల్గొంటారు 24న ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్ మెంట్ కు సంబంధించి హై లెవల్ మీటింగ్ లో ప్రసంగిస్తారు. అదే రోజు డీకార్బనైజ్డ్ ఎకానమీ ఛేంజ్ అన్న అంశంపై జరిగే సమావేశానికి ఏపీ ముఖ్యమంత్రి హాజరవుతారు. సీఎం జగన్ నేతృత్వలో మొత్తం 13 ద్వైపాక్షిక సమావేశాలు, 35 అత్యున్నత స్థాయి సమావేశాలు ఉంటాయని ఏపీ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. పలు సంస్థలతో అగ్రిమెంట్లు ఉంటాయంటున్నారు.ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డికి ఇదే తొలి అధికారిక పర్యటన. దావోస్ సదస్సుకు అన్ని దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతున్నారు. 2 వేల 200 మంది పారిశ్రామిక వేత్తలు, దిగ్గజ సంస్థలు, అంతర్జాతీయ లీడర్లు, ఎకనమిస్టులు హాజరుకానున్నారు. పెట్టుబడుల కోసం జగన్ తొలిసారి దావోస్ వెళ్లడంతో ఏపీకి ఎలాంటి పెట్టుబడులు తీసుకొస్తారన్నది ఆసక్తిగా మారింది.


గతంలో చంద్రబాబు దావోస్ లో తెగ హడావుడి చేసేవారు. దావోస్ సదస్సుకు ప్రతి ఏటా హాజరయ్యేవారు చంద్రబాబు. కీలక సమావేశాల్లో పాల్గొనేవారు. దావోస్ లో స్పెషల్ అట్రాక్షన్ గా ఉండేవారు. చంద్రబాబు దావోస్ పర్యటనకు సంబంధించి జాతీయ స్థాయిలోనూ మంచి ప్రచారం జరిగేది.  ఏపీకి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చామని గతంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు తొలిసారి జగన్ వెళ్లడంతో.. గతంలో చంద్రబాబు పర్యటనతో పోల్చుతూ సోషల్ మీడియాలో చర్చలు సాగుతున్నాయి. చంద్రబాబులా జగన్ దావోస్ లో హడావుడి చేస్తారా.. పెట్టుబడులు తేస్తారా అన్న డిస్కషన్ నడుస్తోంది. వైసీపీ వర్గాలు కూడా జగన్ దావోస్ పర్యటనను ఆసక్తిగా గమనిస్తున్నాయి. చంద్రబాబులా హడావుడి చేయకున్నా... గతంలో కంటే ఎక్కువే పెట్టుబడులను జగన్ సాధిస్తారని వైసీపీ నేతలు చెబుతున్నారు.


READ ALSO: PM Modi Hyderabad Tour: హైదరాబాద్ లో ప్రధాని మోడీ రోడ్ షో? భారీగా జనసమీకరణకు బీజేపీ ప్లాన్..


READ ALSO: Hyderabad Honour Killing: బేగంబజార్ హత్య కేసు నిందితులు అరెస్ట్! కర్ణాటకలో పట్టుకున్న హైదరాబాద్ పోలీసులు..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook