Hyderabad Honour Killing: బేగంబజార్ హత్య కేసు నిందితులు అరెస్ట్! కర్ణాటకలో పట్టుకున్న హైదరాబాద్ పోలీసులు..

Hyderabad Honour Killing:రెండు బైకులపై వెంటాడి నీరజ్ ను హత్య చేశారు దుండగులు. హత్యలో మొత్తం ఐదుగురు దుండగులు పాల్గొన్నట్లు సీసీ టీవీ విజువల్స్ లో బయటపడింది. అందరూ చూస్తుండగానే నీరజ్ పై దాడి చేశారు దుండగులు. మృతుడి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో స్పాట్ లో లభించిన ఆధారాలు, సీసీ టీవీ విజువల్స్ ఆధారంగా దర్యాప్తు చేశారు పోలీసులు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 21, 2022, 08:28 AM IST
  • బేగంబజార్ హత్య కేసు నిందితులు అరెస్ట్!
  • కర్ణాటకలో పట్టుకున్న హైదరాబాద్ పోలీసులు
  • నీరజ్ పవార్ ను హత్య చేసిన దుండగులు
Hyderabad Honour Killing: బేగంబజార్ హత్య కేసు నిందితులు అరెస్ట్! కర్ణాటకలో పట్టుకున్న హైదరాబాద్ పోలీసులు..

Hyderabad Honour Killing: హైదరాబాద్ బేగంబజార్ షాథీనాథ్ గంజ్ మర్డర్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నడిరోడ్డుపై నీరజ్ పవార్ ను అత్యంత కిరాతకంగా హత్య చేసిన నిందితులను పోలీసులు పట్టుకున్నారని తెలుస్తోంది. ఐదుగురు నిందితులను హైదరాబాద్ పోలీసులు కర్ణాటకలో అదుపులోనికి తీసుకున్నారని సమాచారం. హంతకులను కర్ణాటక నుంచి హైదరాబాద్ తీసుకువస్తున్నారని తెలుస్తోంది. బేగంబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో  శుక్రవారం రాత్రి జరిగిన మర్డర్ ఘటన తీవ్ర సంచలనంగా మారింది. అందరూ చూస్తుండగానే నీరజ్ పవార్ ను కత్తులతో పొడిచి చంపారు దుండుగులు. మృతుడి శరీరంపై 20 వరకు కత్తిపోట్లు ఉన్నాయని గుర్తించారు.

రెండు బైకులపై వెంటాడి నీరజ్ ను హత్య చేశారు దుండగులు. హత్యలో మొత్తం ఐదుగురు దుండగులు పాల్గొన్నట్లు సీసీ టీవీ విజువల్స్ లో బయటపడింది. అందరూ చూస్తుండగానే నీరజ్ పై దాడి చేశారు దుండగులు. మృతుడి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో స్పాట్ లో లభించిన ఆధారాలు, సీసీ టీవీ విజువల్స్ ఆధారంగా దర్యాప్తు చేశారు పోలీసులు. మర్డర్ సంచలనంగా మారడంతో ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. కొన్ని గంట్లలోనే నిందితులను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. నిందుతులు వాడిన సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా కర్ణాటకలోని గుడి మత్కల్ లో ఉన్నట్లు గుర్తించిన హైదరాబాద్ పోలీస్ టీమ్.. ఐదుగురు దుండగులను అదుపులోనికి తీసుకుందని తెలుస్తోంది.సంజన్ బాబాయ్ పిల్లలతో పాటు వాళ్ల స్నేహితులు ఈ హత్యకు పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారు.

శుక్రవారం రాత్రి నీరజ్ అనే వ్యక్తి పై  కత్తులతో దాడి చేశారు దుండగులు. ఆసుపత్రి కి తరలిస్తుండగా నీరజ్ మృతి చెందాడు.ప్రేమ వివాహం చేసుకున్నారన్న కక్షతో దాడి చేసి ఉండొచ్చని అనుమానించారు పోలీసులు. మాలి సమాజానికి చెందిన నీరజ్ పవార్ (21 yrs) యాదవ్ సమాజానికి చెందిన సంజన అనే అమ్మాయితో సంవత్సర నర క్రితం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు.వీరికి 2.5 నెలల ఓ బాబు కూడా ఉన్నాడు. పెళ్లి జరిగినప్పటి నుంచే అమ్మాయి కుటుంబీకులు కక్ష పెంచుకుని రద్దీ గా ఉండే బేగంబజార్ ఫిష్ మార్కెట్ లో.. నీరజ్ పవార్ పై కత్తులతో దాడి చేసి అతి దారుణంగా హతమార్చారు.

READ ALSO: Pawan Kalyan: బీజేపీతో పొత్తు లేనట్టేనా! జనసేన గెలిచే సీట్లు ఇవేనా?

READ ALSO: KCR KTR Tours: కేసీఆర్ దేశ పర్యటన, కేటీఆర్ విదేశీ పర్యటన, మరి పాలన ఎలా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook

Trending News