CPI Narayana: మూడు పెళ్లిళ్లు చేసుకున్న పవన్ కు వ్యక్తిత్వమే లేదు
చారిత్రాత్మక తప్పులు చేయడం వామపక్ష పార్టీలకు ముందు నుంచీ అలవాటే అన్నది అందరికీ తెలిసిన విషయమే. గత ఎన్నికల్లో ఏపీ ఎన్నికల్లో చేసిన తప్పుకు లెంపలేసుకుంటున్నామని సీపీఐ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు.
చారిత్రాత్మక తప్పులు చేయడం వామపక్ష పార్టీలకు ( Left Parties ) ముందు నుంచీ అలవాటే అన్నది అందరికీ తెలిసిన విషయమే. గత ఎన్నికల్లో ఏపీ ఎన్నికల్లో ( Ap Elections ) చేసిన తప్పుకు లెంపలేసుకుంటున్నామని సీపీఐ ( CPI ) నేత సంచలన వ్యాఖ్యలు చేశారు.
తప్పులు చేయడం..తరువాత పొరపాటైందనడం వామపక్ష పార్టీలకు అలవాటే. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) లోనూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ ఆ పార్టీలు ప్రతిసారీ తప్పు చేస్తుంటాయి. తరువాత తప్పు చేశామని అంగీకరిస్తాయి. ఇప్పుడు అదే జరిగింది. వామపక్షాల్లో సీపీఎం సంగతేమో కానీ...సీపీఐ మాత్రం లెంపలేసుకుంటోంది. సాక్షాత్తూ ఆ పార్టీ నేత , జాతీయ కార్యదర్శి కె నారాయణ ( CPI Secretary Narayana ) ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమవుతోంది.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో ( 2019 Elections ) జనసేన పార్టీ ( Janasena party ) తో పొత్తు పెట్టుకుంది. పవన్ కళ్యాణ్ ( Pawan kalyan ) తో చెట్టపట్టాలేసుకుని తిరిగారు. ఇప్పుడీ విషయంపై సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ స్పందించారు. జనసేన పార్టీకు వ్యతిరేకంగా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించారు. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తో అనవసరంగా పొత్తు పెట్టుకున్నామని...దానికి ఫలితంగా ఇప్పుడు లెంపలేసుకుంటున్నామని నారాయణ ( Narayana ) వ్యాఖ్యానించారు. రైతులకు వ్యతిరేకంగా కేంద్రం చట్టం చేసిందంటూ విశాఖలో వామపక్షాలు ఆందోళన చేసిన సందర్భంగా నారాయణ మాట్లాడారు. ఆనాడు తమతో పొత్తు పెట్టుకున్న పవన్.. నేడు ప్రధాని మోదీ ( Pm narendra modi ) కాళ్లు మొక్కుతున్నాడని విమర్శించారు. మూడు పెళ్లిళ్లు చేసుకున్న అతనికి వ్యక్తిత్వమే లేదని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని నిర్ణయాలను చంద్రబాబు ఎందుకు వ్యతిరేకించడం లేదో చెప్పాలని ప్రశ్నించారు.
2014 ఎన్నికల్లో బీజేపీని బహిరంగంగా సమర్ధించిన పవన్ కళ్యాణ్..2019 ఎన్నికల్లో విమర్శలు చేశారు. తిరిగి ఇప్పుడు మళ్లీ అదే పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. ఇటు వామపక్ష పార్టీలు గతంలో తెలుగుదేశంతో ( Telugu desam ) పొత్తు పెట్టుకుని తరువాత...తప్పు చేశామంటూ ఒప్పుకున్నాయి. సీపీఐ నారాయణ బహిరంగంగా ఇలా వ్యాఖ్యానిస్తుంటే...అటు అదే పార్టీకు చెందిన రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాత్రం టీడీపీ, జనసేనలకు అనుకూలంగా వ్యవహరిస్తుండటం గమనార్హం. Also read: AP Jobs 2020: ఏపీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్