కరోనా వైరస్ ( Corona virus ) నియంత్రణలో ఏపీ ( Ap ) ముందంజలో ఉంటోంది. దేశంలో ఏ రాష్ట్రం చేయనన్ని అత్యధిక పరీక్షలు ( Highest Tests ) నిర్వహిస్తూ నియంత్రణ సాధిస్తంది. గత నాలుగురోజులుగా కేసులు తగ్గుముఖం పట్టడమే దీనికి నిదర్శనమంటోంది ఆరోగ్య శాఖ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ నిర్దారణ పరీక్షలు ( Covid19 Tests ) అరకోటి దాటేశాయి. మొదట్నించి కరోనా నిర్ధారణ పరీక్షలపైనే దృష్టి పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ( Ap Government ) పరీక్షల సంఖ్యను అంతకంతకూ పెంచుకుంటూ పోతోంది. ప్రస్తుతం రోజుకు సరాసరి 75 వేల పరీక్షలు నిర్వహిస్తోంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో 74 వేల 595 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..8 వేల 218 మందికి పాజిటివ్ గా తేలింది. గత నాలుగురోజుల్నించి 70-75 వేల పరీక్షల్లో 8 వేల పై చిలుకు కేసులే బయటపడుతున్నాయి. అంతకుముందు రోజుకు పదివేల కేసులు బయటపడుతుండేవి. ఇప్పుడు పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతుండటంతో ( Decrease in positive cases ) అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. 


మరోవైపు రాష్ట్రంలో కోలుకుంటున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది ( Increase in recovery rate ) . గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 10 వేల 820 గా ఉంది. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 5 లక్షల 30 వేల 711 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 81 వేల 763 యాక్టివ్ కేసులున్నాయి. ఇక ఏపీలో ఇప్పటివరకూ నిర్వహించిన కోవిడ్ నిర్ధారణ పరీక్షలు 50 లక్షల 33 వేల 676 దాటుతున్నాయి. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య రాష్ట్రంలో 6 లక్షల 17 వేల 776కు చేరుకుంది. 


అటు కరోనా వైరస్ తో మరణించినవారి సంఖ్య 5 వేల 302కు చేరుకోగా..గత 24 గంటల వ్యవధిలో 58 మంది మరణించారు. రికవరీ రేటు క్రమేపీ పెరుగుతుండటం అదే సమయంలో కేసుల సంఖ్య తగ్గుతుండటం మంచి పరిణామమంటున్నారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. Also read: Antarvedi: నూతన రథం నిర్మాణ పనులు ప్రారంభం