గోదావరి నది ( Godavari river ) మహోగ్రరూపం దాల్చేస్తోంది. భారీగా వచ్చి చేరుతున్న వరదతో నీటిమట్టం అంతకంతకూ పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజ్ ( Dowlaiswaram Barriage ) వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజ్ నుంచి 19 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలో వదులుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


అఖండ గోదావరి విశ్వరూపం చూపిస్తోంది. గోదావరి నది ప్రధాన ( Godavari Main stream ) పరివాహక ప్రాంతమైన మహారాష్ట్రలోనూ, ఇతర ఉపనదులైన శబరి ( Sabari ) , ఇంద్రావతి ( Indravathi ) , ప్రాణహిత ( Pranahitha ) పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ( Heavy rains ) గోదావరి నదికి వరద పెద్దఎత్తున వచ్చి చేరుతోంది. గోదావరి నీటి మట్టం గంట గంటకు పెరిగిపోతోంది. సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయానికి  18 లక్షల క్యూసెక్కులున్న వరద ప్రవాహం...3 గంటలకు 19 లక్షల క్యూసెక్కులు దాటేసింది. నీటమట్టం 17.5 మీటర్లకు చేరుకోవడంతో మూడవ చివరి ప్రమాద హెచ్చరికను ( 3rd Warning has been issued ) జారీ చేశారు. అటు భద్రాచలం ( Bhadrachalam ) వద్ద నీటిమట్టం 61 అడుగులకు చేరుకోవడంతో మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. బ్యారేజ్ కు  చెందిన మొత్తం 175 గేట్లను పూర్తిగా ఎత్తివేసి..వచ్చిన వరద నీటిని వచ్చినట్టే దిగువకు సముద్రంలో వదిలేస్తున్నారు. ఎగువ ప్రాంతం నుంచి ముఖ్యంగా గోదావరి ఉపనదుల్నించి భారీగా వరద వస్తుండటంతో...గోదావరి నీటి మట్టం మరింత పెరగవచ్చని అధికార్లు హెచ్చరిస్తున్నారు.


ఇప్పటికే బ్యారేజ్ కు ఎగువన  విలీన మండలాల్లోనూ, దేవీపట్నం, పోలవరం మండలాల్లోనూ పల గ్రామాలు వరద నీటిలో చిక్కుకుపోయాయి. బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఇటు బ్యారేజ్ కు దిగువన కోనసీమలోని చాలా లంక గ్రామాల్లో వరద నీరు ప్రవేశించింది. లోతట్టు, ముంపు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. Also read: AP Govt: సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు