Heavy Rains Alert: ఓ వైపు భారీ వర్షాలు దంచి కొడుతుంటే మరోవైపు ఐఎండీ కీలక ప్రకటన చేసింది. మరో నాలుగు రోజుల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంతో పాటు అల్పపీడనం కూడా ఉండవచ్చని సూచిస్తోంది. అంటే మరో 4-5 రోజులు వర్షాలు తప్పేలా లేవు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నిన్నటి నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఇవాళ కూడా ఏపీలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిశాయి. ఉమ్మడి కృష్ణా జిల్లా అంతా వర్షాలు పడటంతో జనజీవనం ఇబ్బందులు ఎదుర్కొంది. ముఖ్యంగా రైతన్నలకు కష్టాలెదురయ్యాయి. పండిన పంట అకాల వర్షాలకు తడిసి ముద్దవడంతో అన్నదాతల్లో ఆందోళన రేగుతోంది. పార్వతీపురం మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలుస్తోంది. 


మండే ఎండల కాలంలో ఎప్పుడూ లేనివిధంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. నిన్న రాత్రి నుంచి చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. ఎన్టీఆర్, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, నంద్యాల, అంబేద్కర్, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. 


మరోవైపు మే 6 వరకూ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడనుందని ఐఎండీ వెల్లడించింది. మరో 48 గంటల్లో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడవచ్చని తెలిపింది. యూఎస్ వెదర్ ఫోర్‌కాస్ట్ మోడల్, గ్లోబల్ ఫోర్‌కాస్ట్ సిస్టమ్, యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెందర్ ఫోర్‌కాస్ట్ నివేదిక ప్రకారం బంగాళాఖాతంలో తుపాను ఏర్పడవచ్చని తెలుస్తోంది. అంటే మరో 4-5 రోజులు ఏపీలో భారీ వర్షాలు తప్పవని తెలుస్తోంది. 


Also read: Minister Roja to Chandrababu: చంద్రబాబుపై మంత్రి రోజా సంచలన ఆరోపణలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook