ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల పునర్విభజన జరుగుతోంది. కొత్త జిల్లాల ఏర్పాటుపై కమిటీ చేస్తున్న కసరత్తు దాదాపు పూర్తయి వచ్చింది. ఇంతకీ ఎన్ని జిల్లాలు ఏర్పడుతున్నాయి ? 32 కొత్త జిల్లాలు ఏర్పడుతున్నాయా ?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటు ( New Districts ) చర్చనీయాంశంగా మారింది. 2019 అసెంబ్లీ  ఎన్నికల హామీల్లో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) రాష్ట్రంలో 25 పార్లమెంట్ నియోజకవర్గాల్ని ఒక్కొక్క జిల్లాగా చేస్తామని ప్రకటించారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో  జిల్లాల పునర్విభజన ( Districts Reorganisation ) వేగం పుంజుకుంది. ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గం ఒక్కో జిల్లాగా ఏర్పడనుంది. కొత్త జిల్లాల వివరాల్ని సంబంధిత వెబ్‌సైట్‌లో పొందుపరుస్తున్నారు. అయితే విశాఖ జిల్లాలోని అరకు పార్లమెంట్( Araku parliament ) పరిధిలో ఉన్న ప్రత్యేక భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా..26 జిల్లాలు ( 26 Districts ) చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. అరకు పార్లమెంట్ పరిధి శ్రీకాకుళం జిల్లా నుంచి తూర్పు గోదావరి జిల్లా వరకూ విస్తరించి ఉన్న నేపధ్యంలో ఈ నిర్ణయమైంది. Also read: AP: కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ వేగవంతం, జనవరికి సిద్ధం


అదే సమయంలో ఏపీ ( AP ) లో కొత్తగా ఏర్పడేవి 26 కాదు..32 జిల్లాలనే ( 32 New Districts in ap ) విషయం గత వారం రోజుల్నించి వైరల్ అవుతోంది. 32 జిల్లాలకు సంబంధించిన వివరాలు కూడా సర్క్యులేట్ అవుతున్నాయి. 32 జిల్లాలుగా సర్క్యులేట్ అవుతున్న జాబితాలో..


పలాస, శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, అరకు, కాకినాడ, అనకాపల్లి, రాజమండ్రి, అమలాపురం, నర్శాపురం, ఏలూరు, మచిలీపట్నం, విజయవాడ, అమరావతి, గుంటూరు, బాపట్ల, నర్శరావుపేట, మార్కాపురం, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, తిరుపతి, చిత్తూరు, హిందూపురం, అనంతపురం, ఆదోని, కర్నూలు, నంద్యాల, కడప, రాజంపేట జిల్లాలున్నాయి.


అయితే 32 జిల్లాల వార్తలో ఏ మేరకు నిజముందనే విషయంపై జీ హిందూస్తాన్ ( Zee Hindustan ) పరిశీలించింది. సంబంధిత ఏపీసీఎంవో ( APCMO ) కార్యాలయంతో మాట్లాడింది. మాట్లాడిన తరువాత  32 జిల్లాలుగా సర్క్యులేట్ అవుతున్న వార్తలో నిజం లేదని తేలింది. అంతేకాదు ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పడేవి 26 మాత్రమేనని తెలిసింది. దాంతో వైరల్ అవుతున్న 32 జిల్లాల వార్త తప్పని జీ హిందూస్తాన్ పరిశీలనలో తెలిసింది. Also read: AP: వైఎస్ జగన్ సరికొత్త ఆలోచన, విశాఖకు గోదావరి నీరు