Pawan Kalyan: ఆనాడు గాడిదలు కాసావా?.. పందుల దొడ్లో పడుకున్నావా?! పవన్‌పై ఏపీ మంత్రి ఫైర్!!
Vellampalli Srinivas about Pawan Kalyan. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఆంధ్రప్రదేశ్ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వార్నింగ్ ఇచ్చారు. ఖబర్ధార్ పవన్ కళ్యాణ్.. ఏపీలో ఇక తిరగలేవు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
AP Minister Vellampalli Srinivas slams JanaSena Party Chief Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఆంధ్రప్రదేశ్ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వార్నింగ్ ఇచ్చారు. ఖబర్ధార్ పవన్ కళ్యాణ్.. ఏపీలో ఇక తిరగలేవు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ పార్టీ ఎందుకు పెట్టాడనే సంగతి అందరికీ తెలుసన్నారు. రెండు చోట్ల పోటీ చేస్తే ప్రజలు చిత్తుగా ఓడించారని, అయినా సిగ్గురాలేదని వెల్లంపల్లి పేర్కొన్నారు. పవన్‌కు మాట్లాడే అర్హత లేదంటూ మండిపడ్డారు. పవన్ పార్టీ ఎవరి కోసం పెట్టారో నిన్న జరిగిన ఆవిర్భావ సభతో క్లారిటీ ఇచ్చారంటూ ఆయన విమర్శించారు.
మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ... 'పవన్ కళ్యాణ్ పార్టీ ఎందుకు పెట్టాడనే సంగతి అందరికీ తెలుసు. రెండు చోట్ల పోటీ చేస్తే ప్రజలు ఓడించారు.. అయినా సిగ్గురాలేదు. 9వ సంవత్సరంలో మారతాడని ప్రజలు ఆశించి సభకి వచ్చారు. కానీ వారు చాలా నిరాశ చెందారు. ప్రజా వ్యతిరేక ఓట్లు పక్కకి పోనివ్వను అంటూ.. చంద్రబాబుతో కలిసి పనిచేస్తానని హింట్ సభలో పవన్ అన్నారు. బీజేపీ రూట్ మ్యాప్ ఇస్తదని ఎదురు చూస్తున్నానన్నారు. పవన్ సొంతగా ఏం చేసారు' అని ప్రశ్నించారు
'వైఎస్‌ఆర్ మరణం తర్వాత వైఎస్ జగన్ మీద సోనియా గాంధీ ఎన్నో అక్రమ కేసులు పెట్టి హింసించారు. అయినా జగన్ తట్టుకున్నారు. వైసీపీ సింగల్‌గా నిలబడి గెలిచింది. చంద్రబాబుకు భజన చేసే విధంగా జనసేన ఆవిర్భావ సభ జరిగింది. పవన్.. వైసీపీ నాయకులని బెదిరించడం మానెయ్. ఇవన్నీ సినిమాల్లో పనికొస్తాయి కానీ నిజజీవితంలో కాదు. అమరావతి విషయంలో అక్కడి రైతులు పెట్టిన పెరుగన్నం తిన్న పవన్.. హైదరాబాద్ వెళ్లి మాట మార్చారు. వైసీపీ మేనిఫెస్టో సరిగా చూడాలి' అని వెల్లంపల్లి అన్నారు.
'వ్యక్తిగత విషయాలు మేము చేస్తే పవన్ కళ్యాణ్ తట్టుకోలేరు. విగ్రహాల గురించి మాట్లాడే ముందు జనసేన, బీజేపీ, టీడీపీ పొత్తు ఉన్నపుడు విజయవాడలో దేవాలయంని ప్రభుత్వం కూల్చితే గాడిదలు కాసావా?.. పందుల దొడ్లో పడుకున్నావా?. రధం తగలబడితే ఏం చేసావు. రాజకీయాల్లో ఊసరవెల్లి పవన్. ఆయన మాటలను కమిడియన్ మాటలుగా ప్రజలు భావిస్తున్నారు. ఓడిపోయిన పవన్, నాగబాబులకు వైసీపీ గురించి మాట్లాడే హక్కు లేదు. వైసీపీ నాయకులను బెదిరిస్తే.. ఖబర్దార్ పవన్ ఏపీలో తిరగలేవు' అని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ హెచ్చరించారు.
Also Read: Today Horoscope March 15 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి ఊహించని శుభవార్త అందుతుంది!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook