Daily Horoscope March 15 2022: మేషం ( Aries): మధ్యమ ఫలితాలు ఉన్నాయి. చేసే పనిలో నిజాయతీగా ఉండండి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. మొహమాటంకు పోకూడదు. శ్రీరామనామాన్ని జపిస్తే మేలు జరుగుతుంది.
వృషభం (Taurus): ముఖ్య పనుల్లో సానుకూల ఫలితాలు లభిస్తాయి. ఊహించిన ఫలితాలు ఉన్నాయి. బంధు, మిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇష్టదైవ దర్శనం శుభప్రదం.
మిథునం (Gemini): సకాలంలో పనులను పూర్తిచేస్తారు. బంధు, మిత్రులను కలుపుకొనిపోతారు. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ప్రయాణాలు సుఖవంతం అవుతాయి. శివుడిని ఆరాధిస్తే మంచిది.
కర్కాటకం (Cancer): మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. పై అధికారులు మీకు అనుకూలమైన ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. కీలక పనులను కొన్ని పూర్తిచేస్తారు. శివాష్టకం చదివితే మంచిది.
సింహం (Leo): ఆశించిన ఫలితాలు ఉన్నాయి. బంధువులతో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ముఖ్యమైన పనులలో పురోగతి ఉంటుంది. ప్రయాణ సూచన ఉంది. దైవారాధన మానవద్దు.
కన్య (Virgo): వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అంచనాలను అందుకుంటారు. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక ఊహించని శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. ప్రయాణాలు చేస్తారు . దైవారాధన మానవద్దు.
తుల (Libra): మీమీ రంగాల్లో ఆటంకాలు ఎదురైనా.. అధిగమించే ప్రయత్నం చేస్తారు. బంధువులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఒక ముఖ్యమైన పని ముందుకు సాగుతుంది. ఒక శుభవార్త మీ సంతోషాన్ని పెంచుతుంది. గోసేవ చేయాలి.
వృశ్చికం (Scorpio): కీలక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. శత్రువుల మీద విజయం సాధించగలుగుతారు. ఒక వ్యవహారంలో అపకీర్తి వచ్చే ఆస్కారం ఉంది. ప్రయాణాలు వాయిదా వేసుకోండి. నవగ్రహాలను పూజిస్తే మంచింది.
ధనస్సు (Sagittarius): శారీరక శ్రమ పెరుగుతుంది. చేయని పొరపాటుకు నింద పడాల్సి ఉంటుంది. మనోధైర్యాన్ని అసలు కోల్పోకండి. బంధువులతో వాదనలకు చేయొద్దు. నవగ్రహ స్తోత్రం పారాయణ చేస్తే మంచిది.
మకరం (Capricorn): గొప్పవారితో పరిచయం ఏర్పడుతుంది. నలుగురికీ ఆదర్శంగా నిలుస్తారు. ఎంత ఒత్తిడి ఉన్నా.. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి. సూర్యనారాయణ మూర్తి ఆరాధన శుభదాయకం.
కుంభం (Aquarius): మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. కీలక పనుల్లో కుటుంబ సహకారం అందుతుంది. ప్రయాణాలు చేస్తారు. గిట్టని వారికి దూరంగా ఉండాలి. అన్నదానం చేయడం వల్ల మంచి ఫలితాలు ఉన్నాయి.
మీనం (Pisces): మీ రంగాల్లో ఉత్సాహంగా పనిచేస్తారు. బంధువుల సహకారం లభిస్తుంది. ప్రతి విషయంలో కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచింది. లక్ష్మీసహస్రనామం మేలు చేస్తుంది.
Also Read: Radheshyam vs Kashmir Files: రాధేశ్యామ్‌కు హిందీలో..కశ్మీర్ ఫైల్స్ నుంచి ఎదురవుతున్న పోటీ
Also Read: Nagababu: రాజకీయాల్లో దొంగలు పడ్డారు..: మెగా బ్రదర్ నాగబాబు సంచలన వ్యాఖ్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook