Pawan Kalyan: ఏపీ పాలిటిక్స్‌పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాట్ కామెంట్స్ చేశారు. వైసీపీ ఓటమే లక్ష్యంగా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. వైసీపీ, టీడీపీకి కొమ్ముకాసేందుకు తాము సిద్ధంగా లేమన్నారు. రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయం ఉండాలనేదే తమ ధ్యేయమని చెప్పారు. సమయం వచ్చినప్పుడు ఎన్నికల వ్యూహం చెబుతామన్నారు. మరోసారి రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం రాకూడదన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదే తమ వ్యూహామన్నారు. తిరుపతిలో ఆయన పర్యటించారు. రామానుజపల్లి జీఆర్‌ఆర్ కన్వెన్షన్‌ సెంటర్‌లో జనవాణి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈసందర్భంగా ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. అనంతరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అగ్రవర్ణాల ముందు చేతులు కట్టుకునే సంస్కృతి పోవాలని పిలుపునిచ్చారు. పద్యం పుట్టిన ప్రాంతం రాయలసీమలో మద్యం ఏరులైపారుతోందన్నారు. 


ఇటీవల పులివెందులలో ఆరాచకం పెరిగిపోయిందన్నారు పవన్ కళ్యాణ్. సమాజంలో మార్పులు రావాలన్నది తమ ఆకాంక్ష అని తెలిపారు. తమతో కలిసి వచ్చే వారందరినీ కలుపుకుని వెళ్తామన్నారు. ఇలా వచ్చే నాయకులను జనసేన నేతలు, కార్యకర్తలు గౌరవం ఇవ్వాలన్నారు. కేవలం ఎన్నికల కోసమయితే పార్టీలో చేరొద్దన్నారు. వచ్చే ఏడాది తెలంగాణలోనూ పోటీ చేస్తామని స్పష్టం చేశారు. ఇందుకు నేతలంతా సిద్ధంగా ఉండాలన్నారు. 


కడప జిల్లాకు పరిశ్రమలు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో గనులు, అటవీ సంపద విచ్చలవిడిగా దోపిడీకి గురవుతోందని ఆరోపించారు. రాయలసీమలో నేతలు మారినా..పరిస్థితులు మారడం లేదన్నారు పవన్ కళ్యాణ్. మౌలిక వసతులు, రహదారులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రశ్నించిన వారిపై దాడులు జరుగుతున్నాయని విమర్శించారు పవన్ కళ్యాణ్. రాయలసీమలో అభివృద్ధి జరగాలంటే వెనుకబడిన వారు పైకి రావాలని పిలుపునిచ్చారు. 


రాయలసీమలోని అనేక ఉప కులాలకు గుర్తింపు లేదన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కులాల మధ్య ద్వేషం పెంచడం తనకు ఇష్టం లేదన్నారు. కానీ కొందరు కులాల మధ్య అసమానతలు పెంచుతున్నారని మండిపడ్డారు. ఇది పోవాలంటే చైతన్యం రావాలన్నారు. దీనికి ప్రజల్లోకి ఆలోచనా విధానం మారాలని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో రాయలసీమలోనూ పుంజుకుంటమన్నారు. ఇందుకు వ్యూహాలు రచిస్తున్నామన్నారు పవన్ కళ్యాణ్.


Also read:North Floods: ఉత్తరాధిని వణికిస్తున్న వరదలు..వర్ష బీభత్సానికి 37 మంది మృతి..!


Also read:Amit Shah: రాబోయే ఎన్నికల్లో బీజేపీదే అధికారం..మునుగోడు సభలో అమిత్ షా..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి