North Floods: ఉత్తరాధిని వణికిస్తున్న వరదలు..వర్ష బీభత్సానికి 37 మంది మృతి..!

North Floods: ఉత్తర భారతం వరదలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఎడతెరిపిలేని వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. 

Written by - Alla Swamy | Last Updated : Aug 21, 2022, 05:47 PM IST
  • ఉత్తరాధిలో వరద విలయం
  • ఇప్పటివరకు పదుల సంఖ్యలో మృతి
  • కొనసాగుతున్న సహాయక చర్యలు
North Floods: ఉత్తరాధిని వణికిస్తున్న వరదలు..వర్ష బీభత్సానికి 37 మంది మృతి..!

North Floods: ఉత్తర భారతంలోని ఐదు రాష్ట్రాల్లో జలవిలయం కొనసాగుతోంది. వరదల బీభత్సంతో ఇప్పటివరకు 37 మంది మృత్యువాత పడ్డారు. పదుల సంఖ్యలో బాధితులు గల్లంతు అయినట్లు తెలుస్తోంది. వరదల కారణంగా పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఎక్కడికక్కడే రాకపోకలు నిలిచిపోయాయి. హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్, ఒడిశా, జార్ఖండ్, జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. 

భారీ వర్షాలతో నదులన్నీ ఉగ్రరూపం దాల్చుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ముంపు ప్రాంతాల్లో రెస్క్యూ టీమ్‌ను మోహరించారు. అత్యధికంగా హిమాచల్ ప్రదేశ్‌లో 21 మంది మృతి చెందారు. మరో ఆరుగురు గల్లంతు అయ్యారు. వీరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మరో 12 మంది గాయపడ్డారు. 

ఉత్తరాఖండ్‌లో నలుగురు, జార్ఖండ్‌లో మరో నలుగురు చనిపోయారు. ఒడిశాలో ఆరుగురు, జమ్మూకాశ్మీర్‌లో మరో ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఈమేరకు స్థానిక ప్రభుత్వాలు అధికారికంగా ప్రకటించాయి. హిమాచల్‌ ప్రదేశ్‌లో గతంలో ఎన్నడూ లేనివిధంగా వరదలు సంభవించాయి. పాత కాలం నాటి చక్కీ బ్రిడ్జి వరద ధాటికి కొట్టుకుపోయాయి. దీనితోపాటు పలు వంతెనాలు కుప్పకూలాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు..పలు రహదారులను మూసివేశారు.

చండీగఢ్‌, మనాలీ జాతీయ రహదారి మూసివేసినట్లు అధికారులు తెలిపారు. వరదలపై అప్రమత్తంగా ఉన్నామని సీఎం జైరామ్ ఠాకూర్ ప్రకటించారు. వరదలతో ఆస్తి, ప్రాణ నష్టం కల్గడం దురదృష్టకరమన్నారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ముంపు బాధితులకు అన్నివిధాలుగా అండగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఉత్తరాఖండ్‌లోనూ భారీ వర్షాలు కొనసాగుతున్నాయి.

వర్ష బీభత్సానికి పలు ప్రాంతాల్లో ఆస్తి నష్టం సంభవించింది. తెహ్రీ జిల్లాలో ఇంటి గోడ కూలింది. ఈఘటనలో ఇద్దరు మృతి చెందగా..మరో ఐదుగురు గాయపడ్డారు. పౌరీ జిల్లా యంకేశ్వర్‌లోనూ గోడ కూలడంతో ఒకరు మృతి చెందారు. తెహ్రీ జిల్లా కీర్తినగర్‌లో మరొకరు చనిపోయారు. ఉత్తరాఖండ్‌లో కొండచరియలు విరిగి పడటంతో 235 రోడ్లను తాత్కాలికంగా మూసివేశారు. జమ్మూకాశ్మీర్‌లోనూ వర్షాలు దంచికొడుతున్నాయి. 

ఉద్దంపూర్‌లో ఇళ్లూ కూలడంతో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. రియాసీ జిల్లా తాల్వరా ప్రాంతంలో ఇళ్లు దెబ్బతిన్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన కారణంగానే వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌, ఉత్తర ఒడిశా, తూర్పు మధ్యప్రదేశ్‌ మీదుగా అల్పపీడనం కొనసాగుతోంది. మరో 24 గంటల్లో అల్పపీడనం బలహీనపడే సూచనలు ఉన్నాయి.

Also read:Amit Shah Munugode Meeting Live Updates: రైతు సంఘాల నేతలతో చర్చించిన అమిత్ షా.. మునుగోడు సభలో కేసీఆర్ కు స్ట్రాంగ్ కౌంటర్!     

Also read:KL Rahul: కేఎల్ రాహుల్ ఫామ్‌పై ఆందోళన అవసరం లేదు..అతడో క్లాస్ ప్లేయర్ అన్న మాజీ ఆటగాడు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News