కరోనా వైరస్ ( Coronavirus ) కారణంగా ఆలస్యమైన విద్యాసంవత్సరం ( Academic year ) ను తిరిగి ప్రారంభించడానికి ఏపీ ప్రభుత్వం ( Ap Government ) ఒక్కొక్క అడుగూ ముందుకేస్తోంది. విద్యార్దులు ఎదురుచూస్తున్న ట్రిపుల్ ఐటీ ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించడానికి నిర్ణయం తీసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ( Ys Rajasekhar reddy ) ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ట్రిపుల్ ఐటీ ( Triple IT ) లో ఈ విద్యాసంవత్సరం ప్రవేశాలకు కరోనా వైరస్ కారణంగా ఆలస్యమైంది. లాక్డౌన్ ముగిసిన అనంతరం తిరిగి అన్ లాక్ ప్రక్రియ ( Unlock ) ప్రారంభం కావడంతో వ్యవస్థలన్నీ గాడిలోకి వస్తున్నాయి. ముఖ్యంగా విద్యాసంవత్సరాన్ని తిరిగి ప్రారంబించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 


2020-21 విద్యాసంవత్సరానికి ట్రిపుల్ ఐటీ ప్రవేశాలు ( Tripe IT Admissions for 2020-21 ) జరగాల్సి ఉన్నాయి. కరోనా వైరస్ కారణంగా చాలా జాప్యమైంది. వాస్తవానికి పదవ తరగతి పరీక్ష ఫలితాల ఆధారంగా ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలు జరుగుతాయి. ఇదే విషయాన్ని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ( Ap Education minister Adimulapu suresh ) తెలిపారు. కరోనా వైరస్ కారణంగా పరీక్షలు లేకుండానే పదవ తరగతిలో ప్రమోట్ చేసినందున ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు ఇబ్బంది ఎదురైంది. దాంతో ఈ ఏడాదికి ట్రిపుల్ ఐటీ ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్ష ( Joint Entrance Test ) నిర్వహించనున్నట్టు మంత్రి సురేష్ తెలిపారు. మరోవైపు ఎన్జీ రంగా అగ్రికల్చరల్, ఎస్వీ వెటర్నరీ, వైఎస్సార్‌ హార్టీకల్చర్‌ డిప్లొమా కోర్సులకు ప్రవేశ పరీక్షలు ఉంటాయన్నారు.  ఉమ్మడి ప్రవేశ పరీక్షల ప్రకటన ఇప్పటికే వెలువడిందని, ఆన్‌లైన్‌లో దరఖాస్తులు నవంబర్‌ 10 వరకూ అందుబాటులో ఉంటాయని మంత్రి చెప్పారు.  


గడువు దాటిన తరువాత అయితే వేయి రూపాయల పెనాల్టీ ఫీతో నవంబర్ 15 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్ 28న పరీక్ష నిర్వహిస్తామని..డిసెంబర్‌ 5న ఫలితాలు వెల్లడిస్తామని చెప్పారు. ప్రవేశ పరీక్షకు ఓసీ అభ్యర్థులు 3 వందల రూపాయలు, బీసీలకు 2 వందల రూపాయలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే 100 రూపాయిలు ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ ప్రవేశ పరీక్ష పదవ తరగతి స్థాయిలో 100 మార్కులకు ఉంటుందని మంత్రి వివరించారు. తెలంగాణ ( Telangana ) లో కూడా పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, పరీక్షను ఆఫ్‌లైన్‌లో  ఓఎంఆర్ షీట్‌ విధానంలో నిర్వహిస్తామన్నారు. ప్రవేశ పరీక్షకు ఎటువంటి నెగెటివ్‌ మార్కింగ్‌ ఉండదని మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు.  Also read: AP Corona Update: డిసెంబర్ మొదటి వారంలోగా రాష్ట్రంలో జీరో కేసులు?


కరోనా వైరస్‌ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నామన్నారు. నవంబర్ 2 నుంచి వారానికి 3-4 రోజులు స్కూళ్లు తెరవనున్నట్టు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అటు ఇంటర్మీడియట్ అడ్మిషన్లను కూడా నిన్నటి నుంచి ఆన్ లైన్ లో ప్రారంభించింది. ఇందులో భాగంగా  అక్టోబర్ 21 నుంచి ఏపీలో రెండేళ్ల ఇంటర్, ఒకేషనల్ కోర్సుల్లో ప్రవేశాలకు  (AP Inter Online Admissions 2020-21) రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డ్ ఏర్పాట్లు చేసింది.  కోవిడ్19 (COVID-19) పరిస్థితుల నేపథ్యంలో ఆన్‌లైన్ ద్వారా ప్రవేశాల ప్రక్రియ చేపట్టినట్లు విద్యార్ధుల విద్యా సంవత్సరం వృధా కాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు మంత్రి సురేష్.


విద్యాసంవత్సరం వృధా కాకూడదనే ఉద్దేశ్యంతోనే  ఏపీ ప్రభుత్వం ( Ap Government ) నవంబర్ 2 నుంచి స్కూళ్లను ప్రారంభిస్తోంది. వాస్తవానికి సెప్టెంబర్  నుంచి స్కూళ్లు ప్రారంభించాలని అనుకున్నా కరోనా వైరస్ సంక్రమణ నేపధ్యంలో నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది. తరువాత అక్టోబర్ 15 నుంచి తెరవాలని అనుకుంది. కానీ మరోసారి వాయిదా వేసింది. ఇప్పుడు చివరికి అన్ని పరిస్థితుల్ని అంచనా వేసి..నవబంర్ 2 నుంచి ప్రారంభించడానికి ప్రారంభించనున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వయంగా ప్రకటించారు. ఏ రోజు ఏ తరగతులకు స్కూళ్లు తెరవాలనేది వెల్లడించారు. 1, 3, 5, 7 తరగతుల విద్యార్ధులకు ఒకరోజు, 2,4,6,8 తరగతులకు మరో రోజు తరగతులు నిర్వహించనున్నట్లు జగన్ తెలిపారు. Also read: AP: నవంబర్ 2 నుంచే స్కూళ్ల ప్రారంభం..ఏ రోజు ఏ తరగతులంటే..