Eluru mystery Disease: ఏలూరు వింత వ్యాధికి కారణం తెలిసింది..వింటే ఆశ్చర్యపోతారు..
Eluru mystery Disease: ఆంధ్రప్రదేశ్ ను కలవరపెడుతున్న ఏలూరు వింత వ్యాధి కారణాలపై అణ్వేషణ కొనసాగుతోంది. జాతీయ స్థాయి నిపుణులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు రంగంలో దిగి పరిశీలన చేస్తున్నారు. కారణమేంటనేది ప్రాధమికంగా నిర్ధారణైంది. అదేంటంటే..
Eluru mystery Disease: ఆంధ్రప్రదేశ్‌ను కలవరపెడుతున్న ఏలూరు వింత వ్యాధి కారణాలపై అణ్వేషణ కొనసాగుతోంది. జాతీయ స్థాయి నిపుణులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు రంగంలో దిగి పరిశీలన చేస్తున్నారు. కారణమేంటనేది ప్రాధమికంగా నిర్ధారణైంది. అదేంటంటే..
ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) రాష్ట్రాన్ని ముఖ్యంగా ఏలూరు ( Eluru ) నగరాన్ని ఓ వింత వ్యాధి ( Mystery Disease ) కలవరపెడుతోంది. అంతు చిక్కని వ్యాధి విస్తరిస్తూ..అందర్నీ ఆందోళనకు గురి చేస్తోంది. తలనొప్పి, మూర్ఛ, వెన్నునొప్పి, నీరసం, మతి మరుపు, వాంతులు వంటి లక్షణాలతో ఉన్న కేసులు పెరిగిపోతున్నాయి. ఎన్ని పరీక్షలు చేసినా కారణమేంటనేది తెలియడం లేదు. ఈ నేపధ్యంలో జాతీయ స్థాయి నిపుణుల బృందం, ప్రపంచ ఆరోగ్య సంస్థ ( World Health Organisation ) ప్రతినిధుల బృందం ఏలూరుకు చేరుకున్నాయి. శాంపిల్స్ సేకరించి పరీక్షలు చేస్తున్నాయి.
Also read: AP: మూడు రాజధానులపై హైకోర్టులో ప్రభుత్వ వాదన నేటి నుంచి
ఇందులో భాగంగా ఢిల్లీ ఎయిమ్స్ ( Delhi Aiims )కు రాష్ట్ర ప్రభుత్వం పంపించిన ప్రాధమిక నివేదికలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూశాయి. ఈ నివేదికను ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు రాష్ట్ర ప్రభుత్వానికి ( Ap Government ) పంపించారు. బాధితుల నుంచి సేకరించిన బ్లడ్ శాంపిల్‌లో లెడ్ ( led ) అంటే సీసం అత్యధికంగా ఉన్నట్టు గుర్తించారు. సీసం, నికెల్ వంటి భారలోహాలు ఎక్కువగా ఉన్నట్టు ఎయిమ్స్ పరీక్షల్లో తేలింది. లెడ్ కారణంగానే న్యూరో టాక్సిక్ లక్షణాలు కన్పిస్తాయని చెబుతున్నారు.
సీసం అనేది సాధారణంగా బ్యాటరీల్లో ఎక్కువగా ఉంటుంది. తాగునీరు, పాల ద్వారా రోగుల శరీరంలో వెళ్లి ఉండవచ్చని తెలుస్తోంది. ఏలూరు పరిస్థితిపై సంబంధిత అధికార్లతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్..ఈ నివేదికపై చర్చించారు. మరిన్ని పరీక్షల్ని చేస్తున్నామని..ఐఐసీటీ సైతం పరీక్షలు చేస్తోందని అధికారులు ముఖ్యమంత్రి జగన్ కు వివరించారు. అసలు సీసమ్ , నికెల్ వంటి లోహాలు శరీరంలో ఎలా వెళ్లాయనేది పూర్తిస్థాయిలో పరిశోధించాలని అధికార్లను ఆదేశించారు. Also read: Eluru mysterious disease: వింత వ్యాధి ఘటనపై అధ్యయనం కోసం ఏలూరు చేరుకున్న డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధులు