Tollywood: సినీ ప్రముఖులకు స్టూడియోలతో పాటు ఇళ్ల స్థలాలు.. కానీ ఒక కండిషన్ !
Tollywood celebrities | అమరావతి: ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం సహకరించాల్సిందిగా కోరుతూ మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబు, సి కళ్యాణ్, డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తదితరులు మంగళవారం ఏపీ సీఎం వైఎస్ జగన్‌ని ( AP CM YS Jagan) కలిసిన సంగతి తెలిసిందే. అయితే, సినీ పెద్దలతో సమన్వయం చేయాల్సిందిగా సూచిస్తూ సీఎం జగన్ ఆ బాధ్యతను మంత్రి పేర్ని నానికి ( Minister Perni Nani) అప్పగించారు.
Tollywood celebrities | అమరావతి: ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం సహకరించాల్సిందిగా కోరుతూ మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబు, సి కళ్యాణ్, డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తదితరులు మంగళవారం ఏపీ సీఎం వైఎస్ జగన్‌ని ( AP CM YS Jagan) కలిసిన సంగతి తెలిసిందే. అయితే, సినీ పెద్దలతో సమన్వయం చేయాల్సిందిగా సూచిస్తూ సీఎం జగన్ ఆ బాధ్యతను మంత్రి పేర్ని నానికి ( Minister Perni Nani) అప్పగించారు. ఈ నేపథ్యంలో మంత్రి పేర్ని నాని ఈ విషయమై స్పందిస్తూ ముఖ్యమంత్రికి సినీ ప్రముఖులకు మధ్య జరిగిన చర్చల వివరాలను వెల్లడించారు. ( Chiranjeevi: సీఎం జగన్‌ను కలిసిన చిరంజీవి, నాగార్జున, ఇతర టాలీవుడ్ సెలబ్రిటీలు )
[[{"fid":"186510","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో సినీ ప్రముఖుల సమావేశం సానుకూల వాతావరణంలో జరిగిందని.. సినీ ప్రముఖులు కోరిన విధంగానే జులై 15 తర్వాత ఏపీలో సినిమా షూటింగ్‌లకు ( Film shootings) అనుమతిస్తూ అనువైన విధానాన్ని రూపొందించి ఆదేశాలు జారీ చేయాల్సిందిగా సీఎం జగన్ చెప్పారని మంత్రి పేర్ని నాని తెలిపారు. లాక్ డౌన్ కారణంగా సినిమా థియోటర్ల కరెంటు బిల్లులకు సంబంధించి మినిమం డిమాండ్ ఎత్తివేత సైతం ప్రస్తావనకు వచ్చిందని గుర్తు చేశారు. సినిమా టికెట్స్‌ని ఆన్‌లైన్‌లోనే విక్రయించాలని సీఎం జగన్ వారికి సూచించారు. ( విజయ సాయి vs కేశినేని ట్వీట్ వార్ )
మరోసారి సినీ పెద్దలతో చర్చలు:
థియోటర్లు తెరిచేందుకు (Theatres reopening) కేంద్రం నుంచి ఇంకా అనుమతి రాలేదు. కేంద్రం నుంచి అనుమతులు వచ్చిన వెంటనే ఏపీలోనూ సినిమా ప్రదర్శనలకు అనుమతిస్తామని సీఎం జగన్ చెప్పారని మంత్రి పేర్ని తెలిపారు. ప్రభుత్వం నుంచి సినీ కళాకారులకు రావాల్సిన ప్రోత్సాహం ఏ పరిస్థితుల్లోనూ ఆగొద్దని విజ్ఞప్తి చేస్తూ.. 2019 సంవత్సరంకు సంబంధించి నంది అవార్డుల ప్రధానోత్సవాలు ( Nandi Awards 2019) పెండింగ్‌లో ఉన్న విషయాన్ని చిరంజీవి గుర్తుచేశారు. వారి విజ్ఞప్తిపై స్పందించిన సీఎం జగన్.. అలాగే జరుపుతామని చెప్పడం జరిగిందని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు.
( Read also : Motor Vehicles: వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్ )
సినీ పెద్దల విజ్ఞప్తి మేరకు చిన్న సినిమాలకు సంబంధించిన ఫిలిం డెవలప్‌మెంట్ సబ్సిడీ సైతం త్వరలోనే విడుదల చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. అంతేకాకుండా సినీ ప్రముఖులు విశాఖకు తరలి వచ్చి ఇక్కడే సెటిలైతే.. వారికి స్డూడియోలతో ( Film studios in Vizag) పాటు ఇళ్ల స్ధలాలు కూడా కేటాయిస్తామని సీఎం స్పష్టమైన హామీ ఇచ్చినట్టు మంత్రి పేర్ని నాని తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమకు ఎటువంటి కష్టం వచ్చినా.. నేనున్నానంటూ సీఎం జగన్ వారికి భరోసా ఇచ్చారని.. అదే సమయంలో సీఎం సానుకూలంగా స్పందించడంతో సినీ ప్రమఖులంతా సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారని మంత్రి పేర్ని నాని చెప్పారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..