దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ( Former cm ysr )  సతీమణి విజయమ్మ ( ys vijayamma )  రాసిన పుస్తకం ఇప్పుడు సంచలనమౌతోంది. నాలో..నాతో YSR పుస్తకం హాట్ కేకుల్లా అమ్ముడవుతోంది. ఆలోచనల ప్రవాహంగా..భావోద్వేగాల సమాహారంగా సాగిన ఆ పుస్తకం అప్పుడే రెండో ఎడిషన్ కు సిద్ధమవుతోంది. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


జూలై 8న జరిగిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ 71 వ జయంతి సందర్బంగా విడుదలైన నాలో..నాతో YSR ( Naa lo..naa tho..YSR ) ( Within me..With me..YSR ) పుస్తకం ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతోంది. వైఎస్ విజయమ్మ రాసిన ఈ పుస్తకాన్ని ఆమె తనయుడు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan )  ఆవిష్కరించారు. తొలి ఎడిషన్ లో 5 వేల కాపీల్ని ముద్రించారు. ఎమెస్కో సంస్థ ( Emesco ) దీన్ని ప్రచురించింది. ఈ పుస్తకం ఆవిష్కరించిన రోజే బాగా ట్రెండ్ కావడంతో పుస్తకం కాపీలన్నీ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. తొలిరోజే ఆన్ లైన్ ద్వారా మొత్తం 5 వేల కాపీలు సేల్ అయిపోయాయి. ఓ పుస్తకానికి సంబంధించి తొలి ఎడిషన్ కాపీలన్నీ ఒక్కరోోజే అమ్ముడైపోవడం ఇది తొలిసారని ఎమెస్కో సంస్థ వెల్లడించింది. తెలుగు పుస్తకాల అమ్మకాల్లో ఇది ఒక రికార్డుగా ఆ సంస్థ చెబుతోంది. Also read: YSR: నాలో..నాతో YSR పుస్తకంలో ఏముంది?


 


ఈ పుస్తకం అంతలా హాట్ కేకులా అమ్ముడవడానికి చాలా కారణాలున్నాయి. వైఎస్ఆర్ జీవితంలో ( YSR LIFE ) , రాజకీయ ప్రయాణంలో బయటి ప్రపంచం చూడని కొత్త కోణాన్ని పుస్తక రచయిత వైఎస్ విజయమ్మ పరిచయం చేయడం ప్రధానమైంది. ఇక రెండవ కారణం పుస్తకాంశం ఓ మాజీ ముఖ్యమంత్రిది కావడం, రచించింది ఆయన సతీమణి కావడం, ఆవిష్కరించింది ఆయన తనయుడు ఇప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కావడం. Also read: AP: మరో వినూత్న ప్రయోగం: కరోనా బస్సులుగా ఇంద్రబస్సులు


తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ఆర్ ( YSR ) కు పెద్దఎత్తున అభిమానులున్నారు. అందుకే ఫస్ట్ ఎడిషన్ కాపీలన్నీ తొలిరోజే అమ్ముడైపోయాయని విశ్లేషకులు భావిస్తున్నారు. “ వైఎస్ఆర్ ( YSR ) గురించి ప్రపంచానికేమి తెలుసో నేను అర్ధం చేసుకుంటాను. అయితే ఆ మహానేత గురించి బయటి ప్రపంచానికి తెలియని కొన్ని వాస్తవాల్ని ఈ పుస్తకంలో రాశానని “  ముందుమాటలో వైఎస్ విజయమ్మ ( ys vijayamma ) రాసుకొచ్చారు. ఓ కొడుకుగా, తండ్రిగా, సోదరుడిగా, భర్తగా, అల్లుడిగా, మామగా, స్నేహితుడిగా, ఓ నేతగా ఎలా అన్ని బాధ్యతల్ని వైఎస్ఆర్ నెరవేర్చారనేది కూలకషంగా పుస్తకంలో పొందుపర్చినట్టు రచయిత తెలిపారు. 


ఇన్ని విశిష్టతలు, వైఎస్ఆర్ గురించి తెలియని కొత్త కోణాన్ని రచయిత స్పృశించడమే నాలో...నాతో..YSR ( Naa lo..Naa tho..YSR ) పుస్తకం ప్రాచుర్యం పొందడానికి కారణంగా తెలుస్తోంది. అందుకే పుస్తకాన్ని ప్రచురించిన ఎమెస్కో సంస్థ రెండో ఎడిషన్ లో సంఖ్యను పెంచడానికి యోచిస్తోంది.   జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..