YSR: నాలో..నాతో YSR పుస్తకంలో ఏముంది?

దివంగత ముఖ్యమంత్రి వైెఎస్ రాజశేఖర్ రెడ్డి ( Former cm Ys Rajasekhar reddy) 71 వ జయంతి ఆయన అభిమానులకు చాలా గుర్తుండిపోతుంది. కారణం ఆయన సతీమణి రాసిన ఆ పుస్తకమే. నాలో...నాతో YSR పేరుతో రాసిన ఈ పుస్తకం ఇప్పుడు అందరి దృష్టినీ ఆకట్టుకుంటోంది. ఇంతకీ ఆ పుస్తకంలో ఏముందసలు?

Last Updated : Jul 8, 2020, 04:29 PM IST
YSR: నాలో..నాతో YSR పుస్తకంలో ఏముంది?

దివంగత ముఖ్యమంత్రి వైెఎస్ రాజశేఖర్ రెడ్డి ( Former cm Ys Rajasekhar reddy ) 71 వ జయంతి ఆయన అభిమానులకు చాలా గుర్తుండిపోతుంది. కారణం ఆయన సతీమణి రాసిన ఆ పుస్తకమే. నాలో...నాతో YSR పేరుతో రాసిన ఈ పుస్తకం ఇప్పుడు అందరి దృష్టినీ ఆకట్టుకుంటోంది. ఇంతకీ ఆ పుస్తకంలో ఏముందసలు?

ఆ పుస్తకం ఆలోచనల ప్రవాహం. ఆ పుస్తకం భావోద్వేగాల సమాహారం. రాజకీయాలకు, కుటుంబానికి మధ్య వంతెన ఆ పుస్తకం. ప్రజా మనిషిగా ఎదిగి..నిరంతరం ప్రజల్లోనే ఉంటూ ముఖ్యమంత్రిగానే చిరస్మరణీయుడైన ఓ భర్త గురించి ఓ భార్య రాసుకున్ననేపధ్యమే ఈ పుస్తకం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ స్వయంగా రాసిన ఆ పుస్తకం పేరు..” నాలో..నాతో...YSR” ( Within me..with me YSR ) Also read: Ys jagan: ఆర్కేవ్యాలీ త్రిబుల్ ఐటీలో 190 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

వైఎస్ఆర్ ( Ysr life ) జీవితం, నాయకుడిగా ఎదిగిన వైనంతో పాటు సెప్టెంబర్ 2, 2009లో ( September 2, 2009 ) మరణానంతరం నెలకొన్న పరిస్థితులు, సంఘటననలపై తనకు ఎదురైన, అనుభవించిన ఘటనల్ని సమీకరించుకుని వైఎస్ సతీమణి వైఎస్ విజయమ్మ ఈ పుస్తకాన్ని రాశారు. వైఎస్ఆర్ 71వ జయంతి ( Ysr 71st jayanti ) సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ ( Ysr Ghat ) వద్ద ఆమె తనయుడు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) చేతుల మీదుగా ఈ పుస్తకం ఆవిష్కృతమైంది. పుస్తకం రాసింది దివంగత ముఖ్యమంత్రి వైెఎస్ సతీమణి. రాసింది దివంగత ముఖ్యమంత్రిపై. ఆవిష్కరించింది ఆమె తనయుడు ఇప్పటి ముఖ్యమంత్రి. ఇన్ని విశిష్టతలుండటంతో ఈ పుస్తకానికి ప్రాధాన్యత పెరిగింది. Also read: YSR Jayanti: ఘనంగా వైఎస్ఆర్ జయంతి

“ వైఎస్ఆర్ ( ysr ) గురించి ప్రపంచానికేమి తెలుసో నేను అర్ధం చేసుకుంటాను. అయితే ఆ మహానేత గురించి బయటి ప్రపంచానికి తెలియని  కొన్ని వాస్తవాల్ని ఈ పుస్తకంలో రాశానని”..ముందుమాటగా వైఎస్ విజయమ్మ రాసుకొచ్చారు. ఓ కొడుకుగా, తండ్రిగా, సోదరుడిగా, భర్తగా, అల్లుడిగా, మామగా, స్నేహితుడిగా, ఓ నేతగా ఎలా అన్ని బాధ్యతల్ని వైఎస్ఆర్ నెరవేర్చారనే దానిపై కూలంకషంగా పుస్తకంలో పొందుపర్చారు.

యుక్తవయస్సులోనే పెళ్లి, అనంతర పరిస్థితులు, పేదల డాక్టర్ గా ఎలా ప్రాచుర్యం పొందారు, ఎలా రాజకీయాల్లో ప్రవేశించారు, విద్యార్ధి జీవితం, పేదల పక్షపాతిగా మారడం, నాయకత్వ లక్షణాలు ఇలా అన్నింటి గురించి ఈ పుస్తకంలో బయటి ప్రపంచానికి తెలియని చాలా విషయాలు ప్రస్తావించినట్టు తెలుస్తోంది. Also read: Polavaram: వేగం పుంజుకున్న పోలవరం ప్రాజెక్టు పనులు

స్థూలంగా చెప్పాలంటే వైఎస్ఆర్ జీవితం- అతని రాజకీయ ప్రవేశం-మరణానంతరం సైతం ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన వ్యక్తిత్వం గురించి ఈ పుస్తకం ఒక ఎక్కౌంట్  లాంటిది. ఆయన జీవితం ఓ తెరిచిన పుస్తకం..తెలుగు ప్రజలకు అది అంకితం అంటూ వైఎస్ఆర్ ఘాట్ సాక్షిగా వైఎస్ విజయమ్మ ముందుమాటలో స్పష్టం చేశారు. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..  

Trending News