ఏపీ ప్రభుత్వం ( Ap Government )  వర్సెస్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ( Nimmagadda Ramesh kumar ) వ్యవహారంలో మలుపులు తిరుగుతోంది. ఎస్ఈసీ ( SEC ) గా పునర్నియామక విషయంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఏపీ గవర్నర్ ను కలిశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) వివాదాస్ప ఎస్ ఈ సీ నియామక వ్యవహారం ( SEC Appointment ) రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. ఎస్ ఈసీ పదవి నుంచి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను ఏపీ ప్రభుత్వం ( Ap Government ) తొలగించడాన్నిహైకోర్టు ( Ap High court ) వ్యతిరేకించిన విషయం తెలిసిందే. తిరిగి అదే పదవిలో నియమించాల్సిందిగా ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఏపీ ప్రభుత్వం దీనిపై స్టే కోసం సుప్రీంకోర్టును ( Supreme court ) ఆశ్రయించింది. సుప్రీంకోర్టు కూడా స్టేకు నిరాకరించినా ఏపీ ప్రభుత్వం ఎస్ ఈసీగా నిమ్మగడ్డను పునర్నియమించలేదు. దాంతో కోర్డు ధిక్కారణ పిటీషన్ దాఖలు ( Contemp of court ) చేశారు నిమ్మగడ్డ. ఈ వ్యవహారంలో గవర్నర్ ను కలవాల్సిందిగా ఏపీ హైకోర్టు నిమ్మగడ్డకు సూచించింది. Also read: ఏపీలో మరోసారి లాక్‌డౌన్ విధించనున్నారా?


ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు  నిమ్మగడ్డ ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ( Ap Governot BiswaBhushan Harichandan ) ను కలిశారు.  జరిగిన వ్యవహారంపై గవర్నర్ కు వివరించడమే కాకుండా ఓ  వినతి పత్రాన్ని కూడా సమర్పించారు. ఇప్పుడు గవర్నర్ తీసుకోబోయే నిర్ణయం కీలకం కానుంది. హైకోర్టు ఆదేశాల మేరకు ఎస్ ఈసీగా నిమ్మగడ్డను గవర్నర్ పునర్నియమిస్తారా లేదా తిరిగి ఆయన ప్రభుత్వానికి సిఫారసు చేస్తారా అనేది చూడాలి.  Also read: Corona Pandemic: సీఎంలకు ప్రధాని మోదీ ఫోన్: జగన్‌కు అభినందనలు