కరోనా వైరస్ ( Corona virus ) విజృంభణ కొనసాగుతోంది. వైరస్ కట్టడికి రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలు తీసుకుంటున్న చర్యల్ని కేంద్రం పరిశీలిస్తోంది. ఈ నేపధ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ ఫోన్ ( Modi speaks with Ap, Telangana Cms ) లో మాట్లాడటం ప్రాధాన్యత సంతరించుకుంది.
కరోనా కేసుల్లో దేశం ప్రపంచంలో మూడో స్థానంలో కొనసాగుతోంది. ప్రతిరోజూ వెలుగుచూస్తున్న కేసుల సంఖ్య భయపెడుతోంది. ఈ నేపధ్యంలో తాజా పరిస్థితులపై 7 రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ ( pm modi ) ఫోన్‌లో సంభాషించారు. కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు, ప్రస్తుత పరిస్థితుల్ని అడిగి తెలుసుకున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావు ( Telangana Cm k chandra sekhar rao ) , ఏపీ ముఖ్యమంత్రి వైెస్ జగన్ ( Ap cm ys jagan ) లకు ఫోన్ చేశారు మోదీ. కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలతో పాటు పరీక్షల వివరాలపై చర్చించారు. పలు సూచనలు, సలహాలు చేశారు. బీహార్ ( Bihar ) , అస్సోం ( Assam ) , హిమాచల్ ప్రదేశ్ ( Himachal pradesh ) , ఉత్తరాఖండ్ ( Utharakhand ) రాష్ట్రాల సీఎంలతో కూడా మాట్లాడారు. Also read: Ayodhya: రామ జన్మభూమి శంకుస్థాపనకు ముహూర్తం ఫిక్స్
ఏపీ, తమిళనాడు సీఎంలకు మోదీ అభినందనలు:
కరోనా నిర్ధారణ పరీక్షల ( Covid19 Tests ) నిర్వహణలో దేశంలో తమిళనాడు ( Tamilnadu ) , ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) రాష్ట్రాలు తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. ప్రధాని మోదీ ఫోన్ సంభాషణలో ఇదే అంశం చర్చకు వచ్చింది. భారీ ఎత్తున పరీక్షల నిర్వహణలో ముందంజలో ఉన్నందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్, తమిళనాడు సీఎం పళనిస్వామిలను ఫోన్‌లో ప్రధాని మోదీ అభినందించారు. మరిన్ని పరీక్షలు చేయాల్సిందిగా సూచించారు. Also read: AP Districts: ఉగాది నాటికి కొత్త జిల్లాలు ప్రారంభం