Janasena-Tdp: ఏపీలో ఎన్నికలకు ఏడాదిన్నర ముందే రాజకీయ సమీకరణాలు వేడెక్కుతున్నాయి. అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రతిపక్షం ఏకమయ్యేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్ధి కానున్నారా..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలో 2024 ఎన్నికల కంటే ముందే రాజకీయ సమీకరణాలు హాట్ హాట్‌గా మారుతున్నాయి. ఎక్కడ చూసినా టీడీపీ-జనసేన పొత్తు గురించే చర్చ సాగుతోంది. రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందా లేదా..ఉంటే ఎలా ఉండనుంది, సీఎం అభ్యర్ధిగా ఎవరుంటారు, లోకేశ్ పరిస్థితి ఏంటనే ప్రశ్నలు విన్పిస్తున్నాయి.


వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఏకం కావాలని ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అటు టీడీపీ అధినేత చంద్రబాబు సైతం జనసేనతో పొత్తుకు అనుకూలంగా ఉన్నారు. ఎందుకంటే ప్రతిపక్షం చీలితే..విజయం సాధ్యం కాదని ఆయనకూ తెలుసు. అటు బీజేపీతో పొత్తు కోసం కూడా చంద్రబాబు ప్రయత్నిస్తున్నా.. ఆ ప్రయత్నాలు కొలిక్కి రావడం లేదు. 


ముఖ్యమంత్రి అభ్యర్ధిగా పవన్ కళ్యాణ్


టీడీపీ-జనసేన పొత్తుకు జనసేన డిమాండ్ అవరోధంగా మారనుంది. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటిచాలనేది జనసేన డిమాండ్‌గా ఉంది. లేదా చెరో రెండున్నరేళ్లు ముఖ్యమంత్రి పదవిని పంచుకోవాలనేది మరో డిమాండ్. ఈ రెండు డిమాండ్లకు టీడీపీ అధినేత చంద్రబాబు సానుకూలంగా లేరని సమాచారం. అయితే వైసీపీ ఓటమి చెందాలంటే..చంద్రబాబుకు మరో ప్రత్యామ్నాయం లేదనేది జనసేన వర్గాల వాదన. 


మధ్యేమార్గంగా


పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా ప్రకటించి..డిప్యూటీ సీఎం పదవికి నారా లోకేష్ ఉంటారు. మంత్రివర్గంలో మెజార్టీ పదవులు టీడీపీ తీసుకుంటుంది. లేదా చెరో రెండున్నరేళ్లు ముఖ్యమంత్రి పదవిని టీడీపీ-జనసేనలు పంచుకోవాలి. ఈ ప్రతిపాదనను ఇరుపార్టీలు అంగీకరించడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదు. టీడీపీ-జనసేన ఏకమైతేనే వైసీపీని నిలువరించడం సాధ్యమౌతుంది. 


Also read: TDP PLAN: డిసెంబర్ లో టీడీపీ తొలి జాబితా.. జనవరిలో లోకేష్ పాదయాత్ర!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebok