Kuppam Gangamma Jathara Political fight: కుప్పం గంగమ్మ తల్లి జాతరలో వైసిపిలో రెండు వర్గాలకు చెందిన నాయకుల మధ్య జరిగిన భారీ ఘర్షణ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుప్పం మునిసిపల్ పరిధిలోని కొత్తపేటలో జరిగిన ఘర్షణలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అధికార వైఎస్సార్‌సీపీకి చెందిన స్థానిక నేతపై అదే పార్టీకి చెందిన మరో నేత మద్దతుదారులు కత్తులు, కర్రలతో దాడి చేయడంతో కుప్పంలో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో తీవ్రంగా గాయపడిన నాయకుడిని మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కుప్పం నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, గంగమ్మ జాతర ముగింపు ఆచారానికి సంబంధించి దేవత ఊరేగింపుపై వైఎస్‌ఆర్‌సిపి క్యాడర్‌లోని రెండు గ్రూపులు బుధవారం ఘర్షణ పడ్డాయి. బుధవారం అర్థరాత్రి కుప్పం మున్సిపాలిటీ వైస్‌ చైర్మన్‌ మునుస్వామి మద్దతుదారులు స్థానిక వైఎస్‌ఆర్‌సీపీ నేత, మంత్రి పి.రామచంద్రారెడ్డి అనుచరుడు అయిన వాసు కారును ధ్వంసం చేశారు. దీంతో రెచ్చిపోయిన వాసు అనుచరులు, మద్దతుదారులు అందుకు ప్రతీకారంగా మునుస్వామికి చెందిన ఎర్త్‌మూవర్‌ను ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘర్షణల్లో గాయపడిన వాసును తొలుత కుప్పం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.


అయితే, గురువారం వాసు చికిత్స పొందుతుండగా, కర్రలు, పదునైన ఆయుధాలతో వార్డులోకి దూసుకొచ్చిన యువకులు వాసును మంచంపై నుంచి లేపి క్యాజువాలిటీ వార్డు సమీపంలోకి తీసుకొచ్చి మరీ మరోసారి ఆయనపై దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. దీంతో వాసుపై దాడి గురించి తెలుసుకున్న ఆయన మద్దతుదారులు భారీ సంఖ్యలో ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు.


ఇది కూడా చదవండి : AP Assembly Election 2023: ఏపీలో ముందస్తు ఎన్నికల సందడి.. అందుకే ఈ కీలక పరిణామాలు ?


ఆస్పత్రి సిబ్బంది నుంచి సమాచారం అందుకుని అప్రమత్తమైన కుప్పం పోలీసులు.. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని లాఠీచార్జి చేసి ఇరువైపులా జనాలను చెదరగొట్టి పంపించారు. అనంతరం వాసు మద్దతుదారులు ఆయన్ను బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఇరువర్గాల నుంచి ఫిర్యాదులు అందాయని, ఘర్షణల్లో పాల్గొన్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని పలమనేరు పోలీసు ఆఫీసర్ ఎన్.సుధాకర్ రెడ్డి తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కుప్పం పట్టణంలోని ఆర్టీరియల్ జంక్షన్ల వద్ద పోలీసు పికెట్లు ఏర్పాటు చేశారు. ఈ పరస్పర దాడుల ఘటనలకు సంబంధించి మొత్తం 23 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘర్షణలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇరువర్గాల మధ్య జరిగిన దాడికి సంబంధించిన దృశ్యాలు ఒళ్లు గగుర్పొడిచేవిగా ఉన్నాయి.


ఇది కూడా చదవండి : Pawan kalyan Varahi Yatra: పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు ముహూర్తం ఫిక్స్.. అక్కడి నుంచే ప్రారంభం


ఇది కూడా చదవండి : Eggs Pelted at Nara Lokesh: నారా లోకేష్‌పై గుడ్లతో దాడి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK