Polavaram: వేగం పుంజుకున్న పోలవరం ప్రాజెక్టు పనులు
ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) దశాబ్దాల నాటి కలను నెరవేర్చే దిశగా వైఎస్ జగన్ ( Ys jagan ) ప్రభుత్వం అడుగులు వేస్తోంది. బహుళార్ధసాధక ప్రాజెక్టు పోలవరం ( Polavaram Dam ) పనుల్ని వేగం పుంజుకుంటున్నాయి. డ్యామ్ నిర్మాణంలో కీలకమైన భారీ గేట్ల అమరికకు అవసరమైన కీలక ప్రక్రియ ప్రారంభమైంది.
ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) దశాబ్దాల నాటి కలను నెరవేర్చే దిశగా వైఎస్ జగన్ ( Ys jagan ) ప్రభుత్వం అడుగులు వేస్తోంది. బహుళార్ధసాధక ప్రాజెక్టు పోలవరం ( Polavaram Dam ) పనుల్ని వేగం పుంజుకుంటున్నాయి. డ్యామ్ నిర్మాణంలో కీలకమైన భారీ గేట్ల అమరికకు అవసరమైన కీలక ప్రక్రియ ప్రారంభమైంది.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ( Former Ap Cm Ys Rajsekhar reddy ) చేతుల మీదుగా ప్రారంభమైన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు తనయుడు ఇప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ( ys Jaganmohan reddy ) దృష్టి పెట్టారు. కరోనా వైరస్ ( Corona virus ) కారణంగా మూడు నెలల సమయ వృధా అయినా..ఇప్పుడు ఆ పనుల్ని మరింత వేగవంతం చేసేందుకు సంకల్పించారు. డ్యామ్ ( polavaram dam) నిర్మాణంలో కీలకంగా భావించే భారీ గేట్ల అమరికకు రంగం సిద్ధమవుతోంది. భారీ గేట్ల ఏర్పాటులో కీలకమైన గిడ్డర్ల బిగింపు ప్రక్రియ మంగళవారం నాడు ప్రారంభమైంది. అరుదైన హైడ్రాలిక్ వ్యవస్థ ద్వారా గేట్లు పని చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వ్యవస్థ వల్ల వరదలు వచ్చినా సరే గేట్ల నిర్వహణలో ఇబ్బంది ఉండదు. ప్రపంచంలోనే అతి ఉత్తమమైన టెక్నాలజీతో పోలవరం ( polavaram project) పనులు జరుగుతున్నాయి. Also read: AP: ఆన్ లైన్ తరగతులపై చర్యలు తప్పవు: విద్యాశాఖ
ప్రపంచంలోనే అతిపెద్ద స్పిల్ వే ( Spill way ) :
గోదావరి నది (Godavari River) వరదల సమయంలో ప్రాజెక్టు పనులకు ఇబ్బంది కలిగేది. వర్షాల్లోనూ, వరదల్లోనూ పనులు ఆగకుండా ఏర్పాట్లు చేశారిప్పుడు. పోలవరం డ్యామ్ కు చెందిన 48 గేట్లకు కావల్సిన గిడ్డర్ల బిగింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఒక్కో గిడ్డర్ బరువు ఏకంగా 62 టన్నులుంటుంది. ఇది చాలా కష్టసాధ్యమైన పని. ప్రాజెక్టు స్పిల్ వేలోని ( polavaram spill way) 52 బ్లాక్స్ ల పియర్స్ నిర్మాణం దాదాపు పూర్తయింది. స్పిల్ వే పియర్స్ పై గిడ్డర్లు ఏర్పాటైతే దాదాపు చాలా పని పూర్తయినట్టే. స్పిల్ వే 1.2 కిలోమీటర్ల పొడవుతో ప్రపంచంలోనే అతిపెద్దది. ఇప్పటివరకూ చైనాలోని త్రీ గార్జెస్ డ్యామ్ ( Three Gorges dam) లో 47 లక్షల క్యూసెక్కుల వరద ప్రవహించే విధింగా డిజైన్ చేస్తే...పోలవరంలో అత్యధికంగా 50 లక్షల క్యూసెక్కుల వరద ప్రవహించేలా డిజైన్ చేశారు. దీనికి అనుగుణంగానే స్పిల్ వే నిర్మాణం జరుగుతోంది. గిడ్డర్ల పై హాయిస్ట్ వ్యవస్థతో గేట్లను నియంత్రించనున్నారు. పోలవరం స్పిల్ వే పై మొత్తం 196 గిడ్డర్లు ఏర్పాటు కానున్నాయి. వీటిలో 110 గిడ్డర్లు సిద్ధంగా ఉన్నాయి. కేవలం రెండు నెలల కాలంలో ఇవి సిద్ధమయ్యాయి. ఒక్కొక్క గిడ్డర్ సుమారు 22.5 మీటర్లు ఉంటుంది. Also read: AP: సోలార్ విద్యుత్ సిటీగా విజయవాడ
గిడ్డర్ల ఏర్పాటు పూర్తయ్యాక కాంక్రీట్ రోడ్ వేస్తారు. ఆ తరువాత మిగిలేది గేట్లు అమర్చడమే. గిడ్డర్ల ఏర్పాటు, రోడ్ నిర్మాణం పూర్తయితే ఇక గోదావరి నదికి ఎంత వరదొచ్చినా సరే పనులకు ఆటంకం కలగదు. ఆ విధంగా ప్రణాళిక సిద్ధమైంది. Also read: Corona virus: ఏపీ, తెలంగాణ సీఎం నివాసాలకు చేరిన కరోనా వైరస్
ప్రస్తుతం పోలవరం పనుల్ని అన్ని దశల్లోనూ వేగవంతంచేశారు. వచ్చే యేడాది నాటికి ప్రాజెక్టు ( polavaram project works) పనులు పూర్తి చేయాలనే లక్ష్యం దిశగా ఏపీ ముఖ్యమంత్రి వైెఎస్ జగన్ ( Ap cm ys jagan) పనుల్ని పర్యవేక్షిస్తున్నారు. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..