ఏపీ ( AP ) లో పర్యాటకరంగం ( tourism Sector ) అభివృద్ధికి  చర్యలు చేపడుతున్నారు. విజయవాడ, విశాఖపట్నంలో సీ ప్లేన్ ( Seaplane ) సౌకర్యాన్ని కల్పించేందుకు కృషి జరుగుతోంది. రివర్ టూరిజంలో భాగంగా ఇప్పటికే 60 బోట్లకు అనుమతులు మంజూరయ్యాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


కరోనా వైరస్ ( Coronavirus ) కారణంగా మూలనపడిన పర్యాటకాన్ని తిరిగి గాడిలో తెచ్చేందుకు పూర్తి ప్రయత్నాల్ని ప్రారంభించింది ఏపీ ప్రభుత్వం ( Ap Government ). రివర్ టూరిజంను ( River Tourism ) అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగంగా నదీ, రిజర్వాయర్ ప్రాంతాల్లో బోటింగ్ కార్యకలాపాల్ని పునరుద్ధరిస్తోంది. పర్యాటక శాఖ అధికార్లతో సమీక్ష అనంతరం రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ ( Ap Tourism minister Muttamsetti srinivas ) మీడియాకు వివరాలు వెల్లడించారు. 


రాష్ట్రంలో కొత్తగా 60 పర్యాటక బోట్ల ( Tourism Boats ) కు అనుమతులు మంజూరయ్యాయి. 174 బోట్లు నడిపేందుకు దరఖాస్తులు వచ్చాయని..ప్రాధమిక పరిశీలన అనంతరం 60 బోట్లకు అనుమతిచ్చినట్టు మంత్రి తెలిపారు. కరోనా వైరస్ కారణంగా మూతపడిన పర్యాటక కార్యకలాపాలను త్వరితగతిన పునరుద్ధరించేందుకు తక్షణ చర్యలు తీసుకుంటున్నామన్నారు. విశాఖపట్నంతో పాటు తూర్పు గోదావరి జిల్లా దిండి, రాజమహేంద్రవరంలో ఇప్పటికే పర్యాటక బోట్లు ప్రారంభమయ్యాయని చెప్పారు. Also read: AP Board of Intermediate: విద్యా సంవత్సరం క్యాలెండర్ విడుదల


విజయవాడ, విశాఖపట్నంలో సీ ప్లేన్‌ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నట్టు మంత్రి శ్రీనివాస్ తెలిపారు.  రాష్ట్రంలో త్వరలో 5 స్టార్, 7 స్టార్ హోటళ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో 9 చోట్ల కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రాల్ని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు బోటింగ్ పరిస్థితిని, లైసెన్సుల వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. పాపికొండలు ప్రాంతంలో జల వనరుల శాఖ ఆధ్వర్యంలో నావిగేషన్‌ సర్వే చేయాల్సి ఉన్నందున అక్కడ మినహా అన్నిచోట్లా త్వరలో బోటింగ్‌ కార్యకలాపాలు ప్రారంభించనున్నట్టు మంత్రి చెప్పారు. 


మరోవైపు సాగర సంగమం, అంతర్వేది, హంసలదీవిలో పర్యాటక బోట్లు నడపనున్నామన్నారు. కొల్లూరు, ఐలేరుల్లో కొత్తగా పర్యాటక పడవలను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యంతో విధానంలో కొత్తగా బోటింగ్ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. Also read: AP: ప్రైవేటు విద్యపై నిఘా, 48 డిగ్రీ కళాశాలల మూసివేత