Rain Alert: దేశంలో నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. రోజు రోజుకు నైరుతి గాలులు అన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. దీంతో ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా జోరుగా వాన కురుస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాగల మూడురోజులపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కింది స్థాయి గాలులు నైరుతి దిశ నుంచి ఏపీ, తెలంగాణ వైపు వీస్తున్నాయని తెలిపింది. దీని ప్రభావంతో రాగల మూడు రోజులపాటు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోని కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.


ఇవాళ, రేపు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వివరించింది. అక్కడక్కడ భారీ వర్షాలు సైతం కురుస్తాయని తెలిపింది. ఏపీలోనూ ఇదే పరిస్థితి ఉంటుందని పేర్కొంది. తీరం వెంట పెను గాలులు వీచే అవకాశం ఉందని..ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది.


Also read: AP Inter Results 2022: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి!


Also read:CBI CASE ON KCR: సీబీఐ ఉచ్చులో సీఎం కేసీఆర్? 9 లక్షల కోట్ల అవినీతి జరిగిందా? కేంద్రం చేతిలో ఉన్న అక్రమాల చిట్టా ఇదేనా.. ?  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook