ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Andhra Pradesh cm ys jagan ) ప్రతిపక్షం తెలుగుదేశంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. సంక్షేమ పధకాల్ని కోర్టుల ద్వారా అడ్డుకుంటున్న దౌర్భాగ్య రాజకీయాలు రాష్ట్రంలో నడుస్తున్నాయని  సీఎం జగన్ దుయ్యబట్టారు. పేదలకు అందాల్సిన ఇళ్ల పట్టాల విషయంలో కూడా కోర్డు మెట్లెక్కి అడ్డుకుంటోందని జగన్ స్పష్టం చేశారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


జగనన్న పచ్చతోరణం ( jagananna pacha thoranam) కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లా ( Krishna District ) మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నంలో ఏర్పాటైన మొక్కలు నాటే కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ ( Ap cm ys jagan ) పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ( Telugu desam party ) పై తీవ్రంగా  విరుచుకుపడ్డారు. సంక్షేమ కార్యక్రమాల్ని టీడీపీ కోర్టుల ద్వారా అడ్డుకుంటోందని ఆరోపించారు. పేదలకు ఇవ్వాల్సిన ఇళ్లపట్టాల్ని కూడా ఇవ్వకుండా కోర్టుల్లో పిటీషన్ లు వేస్తూ అడ్డంకులు సృష్టిస్తోందన్నారు. తాము అనుకున్న సంక్షేమ పధకాల్ని అమలు చేయాలంటే సుప్రీంకోర్టుకు వెళ్లాల్సివస్తోందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. Also read: Oxford Vaccine: ఆ వ్యాక్సిన్ లో సగం భారత్ కే


సుప్రీంకోర్టులో ( Supreme court ) ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పువస్తుందని ఆశిస్తున్నామని ఏపీ సీఎం జగన్ ( Jagan ) తెలిపారు. ఆగస్టు 15న ఇళ్లస్థలాలు పంపిణీ చేస్తామని చెప్పారు. ఆ రోజు మొత్తం రాష్ట్రంలో 30 లక్షల పేద కుటుంబాలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామన్నారు. Also read: Serum Institute: కోవిడ్ 19 వ్యాక్సిన్ తేదీ, ధర నిర్ణయం