Serum Institute: కోవిడ్ 19 వ్యాక్సిన్ తేదీ, ధర నిర్ణయం

కరోనా వ్యాక్సిన్ ధర ( Corona vaccine price ) నిర్ణయమైపోయింది. వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేయబోతున్న కంపెనీ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది. అందరికీ అందుబాటులో ఉండేట్టుగా ఉన్న ఆ వ్యాక్సిన్ ధరను..సాధ్యమైనంతవరకూ ప్రభుత్వాలు ఉచితంగానే అందించే అవకాశాలు కూడా లేకపోలేదు.

Last Updated : Jul 22, 2020, 12:07 PM IST
Serum Institute: కోవిడ్ 19 వ్యాక్సిన్ తేదీ, ధర నిర్ణయం

కరోనా వ్యాక్సిన్ ధర ( Corona vaccine price ) నిర్ణయమైపోయింది. వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేయబోతున్న కంపెనీ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది. అందరికీ అందుబాటులో ఉండేట్టుగా ఉన్న ఆ వ్యాక్సిన్ ధరను..సాధ్యమైనంతవరకూ ప్రభుత్వాలు ఉచితంగానే అందించే అవకాశాలు కూడా లేకపోలేదు.

కరోనా వ్యాక్సిన్ తయారీలో ముందురేసులో ఉన్న కంపెనీ ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ( Oxford University ) అన్న విషయం అందరికీ తెలిసిందే. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రపంచ అగ్రదేశాలు పరిశోధనల్లో మునిగిఉన్నా...యూకేకు చెందిన ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ పరిశోధనలు ముందంజలో ఉన్నాయి. యూకేకు చెందిన మరో ప్రసిద్ధ ఫార్మా కంపెనీ ఆస్ట్రా జెనెకాతో( AstraZeneca ) కలిసి చేస్తున్న వ్సాక్సిన్ అభివృద్ధి కీలకమైన రెండు క్లినికల్ దశల్ని దాటింది. క్లినికల్ దశ ప్రయోగ ఫలితాల్ని ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ తాజాగా వెల్లడించింది కూడా. వ్యాక్సిన్ విజయవంతమైందని చెప్పింది. Also read: Oxford Vaccine: ఆ వ్యాక్సిన్ లో సగం భారత్ కే

వ్యాక్సిన్ ధర వేయి రూపాయలు:

ఈ నేపధ్యంలో ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ ధర ఎంత ఉంటుందనే విషయంలో అందరికీ ఆసక్తి నెలకొంది. ధర అందరికీ అందుబాటులో ఉంటుందా లేదా అనే సంశయం కూడా నెలకొంది. ఈ నేపధ్యంలో వ్యాక్సిన్ ఉత్పత్తి, సరఫరా చేసే బాధ్యతను తీసుకున్న ఇండియన్ కంపెనీ సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ( Serum Institute of india ) వ్యాక్సిన్ ధర ( Vaccine price ) ఎంత ఉంటుందనేది వెల్లడించారు. కంపెనీ సీఈఓ అదార్ పూణావాలా ( CEO Adar poonawalla ) స్వయంగా ఈ విషయంపై ప్రకటన చేశారు. వ్యాక్సిన్ ధర వేయి రూపాయల వరకూ ఉంటుందని..ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వాలే సామూహిక ఇమ్యునైజేషన్ కింద ఉచితంగా అందించే అవకాశాలున్నాయని అదార్ పూణావాలా చెప్పారు. ఆఫ్రికా వంటి నిరుపేద దేశాలకు 2-3 డాలర్లకు అంటే 150 నుంచి 225 రూపాయలకే అందించనున్నట్టు సీరమ్ ఇనిస్టిట్యూట్ ప్రకటించింది. Also read: Corona Symptoms: కోవిడ్19 వైరస్ అదనపు లక్షణాలివే

2021 జూన్ కు వ్యాక్సిన్ ఆవిష్కరణ:

అన్నీ అనుకున్నట్టు జరిగితే మూడు నెలల్లోనే 30 నుంచి 40 కోట్ల టీకా డోసుల్ని తయారు చేసే సామర్ధ్యాన్ని సీరమ్ ఇనిస్టిట్యూట్ కలిగి ఉంది.  వచ్చేయేడాది అంటే 2021 జూన్ కు వ్యాక్సిన్ ( Corona vaccine by 2021 june ) ఆవిష్కరిస్తామని చెప్పారు. Also read: Oxford university's vaccine: కరోనావైరస్ వ్యాక్సిన్‌పై గుడ్ న్యూస్ వచ్చేసింది

Trending News