Ys Jagan on Chandrababu: చంద్రబాబూ..ఇక నీవు మారవా, ఎక్స్ సాక్షిగా దుమ్మదులిపేసిన జగన్
Ys Jagan on Chandrababu: తిరుపతి లడ్డూ వ్యవహారం నుంచి తరచూ మీడియా సమావేశాలతో హల్చల్ చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి చంద్రబాబును దులిపిపడేశారు. సుప్రీంకోర్టు తప్పుబట్టినా మారవా బాబూ అంటూ ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ys Jagan on Chandrababu: తిరుపతి లడ్డూ విషయంలో సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా, లడ్డూ వ్యవహారంలో దేవుడిని రాజకీయాల్లో లాగవద్దని కోరినా చంద్రబాబు వైఖరి మారడం లేదని వైఎస్ జగన్ మండిపడ్డారు. సోషల్ మీడియాలో తెలుగుదేశం అధికారిక హ్యాండిల్‌లో చేసిన పోస్టింగ్స్ ఇందుకు సాక్ష్యమని జగన్ స్పష్టం చేశారు. మొత్తం వ్యవహారాన్ని జగన్ ఎక్స్‌లో ప్రధాని మోదీ, అమిత్ షా, బీజేపీ సహా అన్ని రాజకీయ పార్టీలు, రాహుల్ గాంధీ, మమతా గాంధీ అందరు రాజకీయ ప్రముఖులకు ట్యాగ్ చేశారు.
తప్పు జరిగిందని తెలిసినా దేవుడి పట్ల ఇంత దారుణంగా వ్యవహరించామని అర్ధమైనా ముఖ్యమంత్రి చంద్రబాబులో కనీసం పశ్చాత్తాపం కన్పించడం లేదన్నారు. జాతీయ నేతలకు అర్ధమయ్యేలా ఆంగ్లంలో మొత్తం వ్యవహరాన్నివిన్పించారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో జంతువుల కొవ్వు కలిపిన కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు సీరియస్ కావడంతో కొత్తగా అబద్ధాలు ప్రారంభించారన్నారు. తెలుగుదేశం అధికారిక ఎక్స్ ఖాతాలో ఏం పోస్ట్ చేశారో కూడా చదివి విన్పించారు. మనిషైన తరువాత కాస్త అయినా దేవుడంటే భక్తి ఉండాలన్నారు. అవేమీ లేకుండా సుప్రీంకోర్టు వ్యాఖ్యల్ని వక్రీకరించి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
తిరుమల లడ్డూ వ్యవహారంలో తుది తీర్పులో భాగంగా సుప్రీంకోర్టు సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ సిట్ ఏర్పాటును మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆహ్వానించారు. కోట్లాదిమంది భక్తుల మనోభావాలు ముడిపడి ఉన్నందున ఈ వ్యవహారంపై స్వతంత్ర, నిష్పాక్షిక దర్యాప్తు అవసరమని న్యాయస్థానం అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసినా తిరుమల లడ్డూ వివాదాన్ని తెలుగుదేశం ఇంకా రాజకీయం చేస్తోందని వైఎస్ జగన్ మండిపడ్డారు.
Also read: Winter Predictions: ఏపీ, తెలంగాణ సహా దేశమంతా పంజా విసరనున్న చలి పులి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.