Winter Predictions: వర్షాకాలం దాదాపుగా ముగుస్తోంది. వచ్చె నెల నుంచి శీతాకాలం ప్రారంభం కానుంది. అందరూ అల్మారాల్లో దాచిన రగ్గులు బయటకు తీయాల్సిన సమయం వచ్చింది. ఈసారి రెండు రగ్గులు కప్పుకోవల్సి వస్తుందంటున్నారు వాతావరణ శాస్త్రజ్ఞులు. చలి తీవ్రత గత ఏడాది కంటే ఈసారి భారీగా ఉంటుందని అంచనా. ముఖ్యంగా తెలంగాణలో చలి తీవ్రత పెరగనుందని తెలుస్తోంది.
మరో నెలరోజుల్లో వర్షాకాలం ముగిసి శీతాకాలం ప్రవేశించనుంది. అప్పుడు ఉత్తరాది నుంచి నైరుతి రుతు పవనాల తిరోగమనం ప్రారంభమైంది. ఈ నెలలో లా నినో ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా దేశవ్యాప్తంగా ఈ ఏడాది చలి తీవ్రంగా ఉండవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ముఖ్యంగా వాయువ్య, మధ్య భారత దేశంలో చలిగాలులు ఎక్కువగా ఉండనున్నాయి. పంజాబ్, ఢిల్లీ రాష్ట్రాల నుంచి అప్పుడే తిరోగమన నైరుతి రుతు పవనాలు వీస్తున్నాయి. వీటి కదలిక నెమ్మదిగా ఉండి మొదటి వారంలోగా ఈ ప్రాంతాల్ని వీడే అవకాశాలు కన్పించడం లేదు. దాంతో చలి తీవ్రత ఎక్కువగా ఉండవచ్చు. అక్టోబర్ మూడో వారం నాటికి తిరోగమన నైరుతి రుతు పవనాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్ని దాటవచ్చు. అందుకే ఈసారి వేసవిలానే చలి కూడా ఎక్కువగా ఉండవచ్చు
ఇక తెలంగాణలో ఈసారి జాగ్రత్తగా ఉండాలని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2023లో రాష్ట్రంలో అతి తక్కువ ఉష్ణోగ్రత 3.5 డిగ్రీలు నమోదు కాగా ఈసారి కూడా అదే పరిస్థితి ఉండవచ్చని తెలుస్తోంది. తెలంగాణలో చలికాలం సగటు ఉష్ణోగ్రత 22 డిగ్రీలు కాగా గత రెండేళ్లుగా 18-19 డిగ్రీలు నమోదవుతోంది. ఈసారి కూడా సగటు 18 డిగ్రీలు ఉండవచ్చని అంచనా ఉంది. వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవాళ్లు వచ్చే చలికాలంలో అప్రమత్తంగా ఉండాలి. అటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా చలి పులి పంజా విసరనుంది. సాధారణంగా ఏపీలో చలికాలంలో సగటు ఉష్ణోగ్రత 25-27 డిగ్రీలుంటుంది. ఈసారి 19-21 డిగ్రీలు ఉండవచ్చని అంచనా. మొత్తానికి ఈసారి చలికాలం తీవ్రంగానే ఉండనుంది.
Also read: IMD Rain Alert: ఏపీ, తెలంగాణల్లో వచ్చే మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.