AP TDP: షాక్ ఇవ్వనున్న మరో ఎమ్మెల్యే, ఆ ముగ్గురి బాటలోనే..
ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం ఇప్పుడు వాస్తవానికి మిగిలిన ఎమ్మెల్యేల సంఖ్య ఎంత? ఈ ప్రశ్నకు సమాధానం కష్టమే. కండువా కప్పుకోకుండానే వైసీపీ ఎమ్మెల్యేలుగా మారుతున్నారు. ఇవాళ మరో ఎమ్మెల్యే షాక్ ఇవ్వబోతున్నారు.
ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) లో ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం ( Opposition party Telugu Desam ) కు ఇప్పుడు వాస్తవానికి మిగిలిన ఎమ్మెల్యేల సంఖ్య ఎంత? ఈ ప్రశ్నకు సమాధానం కష్టమే. కండువా కప్పుకోకుండానే వైసీపీ ఎమ్మెల్యేలుగా మారుతున్నాయి. ఇవాళ మరో ఎమ్మెల్యే షాక్ ఇవ్వబోతున్నారు.
ఏపీ ప్రతిపక్షపార్టీ తెలుగుదేశం ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో పడిపోయింది. ఓ వైపు కేసులు, మరోవైపు జంపింగ్ నేతలు, తిరుగుబాటు ఎమ్మెల్యేలు. 2019 ఎన్నికల్లో ( 2019 General Elections ) ఆ పార్టీ గెలిచిన ఎమ్మెల్యేల సంఖ్య 23. మరి అంతమంది ఉన్నారా లేదా అంటే పార్టీ వర్గాలే కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. దీనికి కారణం కండువా కప్పుకోకుండానే అధికారపార్టీకు అనుకూలంగా వ్యవహరిస్తూ...టీడీపీలో తిరుగుబాటు ఎమ్మెల్యేలుగా చెలామణి అవుతున్నారు మరి. ఇప్పుడు అదే కోవలో మరో ఎమ్మెల్యే వచ్చి చేరుతున్నట్టు సమాచారం.
ఇప్పటికే టీడీపీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు రెబెల్స్ లేదా అసంతృప్త ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఒకరైతే నేరుగా తాను వైసీపీ ఎమ్మెల్యేననే చెప్పుకుంటున్నారు. చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం ( Chirala mla karanam balaram ) , గుంటూరు ఎమ్మెల్యే మద్దాల గిరి ( Guntur mla maddala giri ), గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ( Gannavaram mla vallabhaneni vamsi ) లు పార్టీకు వ్యతిరేకంగా ఉన్నారు. వైసీపీ విధానాలకు బహిరంగంగానే మద్దతు పలుకుతున్నారు. ఇప్పుడు వీరి సరసన మరో ఎమ్మెల్యే వచ్చి చేరుతున్నట్టు తెలుస్తోంది.
విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ( Visakha south mla vasupalli ganesh ) టీడీపీ నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నారు. ఇవాళ మధ్యాహ్నం సీఎం వైఎస్ జగన్‌ను కలిసి మాట్లాడనున్నారు. అయితే మిగిలిన ఎమ్మెల్యేలలానే ఈయన కూడా కండువా కప్పుకోకుండా..సీఎం జగన్‌కు మద్దతు తెలపనున్నారు వాసుపల్లి గణేష్. 2014,2019లలో వరుసగా రెండుసార్లు విజయం సాధించారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి ద్రోణంరాజు శ్రీనివాస్ రావుపై గెలిచారు. విశాఖ రాజధానికి తమ పార్టీ వ్యతిరేకించడమే ఈయన అసంతృప్తిగా కారణంగా తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా టీడీపీ కార్యక్రమాలకు వాసుపల్లి దూరంగా ఉంటున్నది అందుకేనని తెలుస్తోంది.
వరుసగా ఎమ్మెల్యేలు పార్టీకు వ్యతిరేకంగా మారడం తెలుగుదేశం వర్గాలకు మింగుడుపడటం లేదు. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలైతే ఇప్పుడు మరో ఎమ్మెల్యే. ఎంతమంది వెళ్లిపోయినా నష్టం లేదని...కార్యకర్తలే తమకు బలమని పైకి చెబుతున్నా లోలోపల మాత్రం ఆందోళనగానే ఉన్నాయి టీడీపీ వర్గాలు. ఎమ్మెల్యేలు జారిపోవడం ఉత్తరాంధ్రలో కూడా ప్రారంభం కావడంతో టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. Also read: AP: న్యాయవ్యవస్థ వర్సెస్ శాసన వ్యవస్థ..పార్లమెంట్ వేదికగా పోరాటం